రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం/ హైదరాబాద్, జూలై 14: వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది రెండు మూడు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం శుక్రవారం రాత్రి వెల్లడించింది. ఈ ప్రభావంతో రెండు మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాగల 24 గంటల్లో కోస్తా అంతటా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అల్పపీడనం కారణంగా కోస్తాతీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా గాలులు వీస్తాయని తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అదే సమయంలో నైరుతి రుతు పవనాలు సైతం చురుగ్గా కదులుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.