రాష్ట్రీయం

మీరు కోరినట్టే విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతీ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచిత ప్రవర్తనపై ఐజి స్థాయి అధికారిణితో విచారణ జరపించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తనపై ఐజీ స్థాయి అధికారిణితో విచారణ జరిపించాలన్న ఐఏఎస్‌ల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తనను కలిసిన ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ సూత్రప్రాయంగా వెల్లడించారు. మహబూబాబాద్ సంఘటన నేపథ్యంలో జరిగిన ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ల పత్రాన్ని శుక్రవారం సీనియర్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య నేతృత్వంలోని బృందం ఎస్‌పి సింగ్‌ను కలిసి సమర్పించారు. ఇకముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుం డా ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఐఏఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. మహబూబాబాద్‌లో జరిగిన ఘటననే కాకుండా ఇతర జిల్లాల్లోనూ అధికారులు, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ప్రజాప్రతినిధుల నుంచి ఎదుర్కొంటు న్న ఇబ్బందులను కూడా ఈ సందర్భంగా సిఎస్‌కు బిపి ఆచార్య వివరించారు. వీటిన్నింటిపై గోప్యంగా నివేదికలు తెప్పించుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది. తనపట్ల కొంతకాలంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఏవిధంగా ప్రవర్తిస్తున్నదీ ప్రీతీ మీనా స్వయంగా సిఎస్ ఎస్‌పి సింగ్‌కు ఈ సందర్భంగా వివరించారు. మహబూబాబాద్ సంఘటనను సిఎం తీవ్రంగా పరిగణించడం వల్లే సీరియస్‌గా స్పందించారని, విచారణకు ఆదేశించడానికి సానుకూలంగా ఉన్నారని సిఎస్ తనను కలిసిన బృందానికి వివరించినట్టు తెలిసింది. ఇలాఉండగా విచారణ అధికారిణి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదని, ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాక నిర్ణయం తీసుకుంటామని వీరికి సిఎస్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.

చిత్రం.. సిఎస్ ఎస్‌పి సింగ్‌కు వినపతిపత్రం అందిస్తున్న బిపి ఆచార్య, ప్రీతీ మీనా