రాష్ట్రీయం

యుకెకు వెళ్లే విద్యార్థులకు 18న అవగాహన సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: బ్రిటన్‌కు పై చదువుల కోసం వెలుతున్న విద్యార్ధుల కోసం బ్రిటిష్ కౌన్సిల్ ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి ఆరు గంటల వరకూ అవగాహనా సదస్సును ఏర్పాటు చేసింది. యూనివర్శిటీల నుండి ఆఫర్ లేఖలను అందుకున్న వారు మాత్రమే ఈ సదస్సుకు హాజరుకావాలని, విద్యార్ధులు యుకెలో చేయదగినవి, చేయకూడనివి కూడా ఈ సదస్సులో వివరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటీవల యుకె నుండి వచ్చిన పూర్వ విద్యార్ధులతో ముఖాముఖి ద్వారా యుకెలో వారి అద్భుత అనుభవాలను పంచుకుని ఆ తర్వాత విద్యార్ధులు ప్రవేశ అనుమతి పొందిన వెంటనే తక్షణం తీసుకోవల్సిన అంశాలపైనా టైర్ 4 స్టూడెంట్ వీసా అప్లికేషన్స్ అండ్ రిలేటెడ్ ప్రొసీజర్సు ఏద్వారా యుకె వీసా అండ్ ఇమ్మిగ్రేషన్‌కు చెందిన అధికారులు ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశం ద్వారా సంస్కృతి, ఆహార అలవాట్లు, రవాణా, వసతి , జీవిత విధానం గురించి కూడా వివరించడం జరుగుతుందని అన్నారు. ఇతర వివరాలకు బ్రిటిష్‌కౌన్సిల్ డాట్ ఇన్ అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలని కౌన్సిల్ అధికారులు చెప్పారు.