రాష్ట్రీయం

సెంట్రల్ వర్సిటీకి ప్రపంచ ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 14: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి ప్రపంచ స్థాయి ర్యాంకు దక్కింది. క్యూఎస్ సంస్థ 1967 తర్వాత ఏర్పాటు చేసిన యూనివర్శిటీల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన విశ్వవిద్యాలయాలకు రేటింగ్‌లు ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న యూనివర్శిటీల్లో భారత్ నుండి మూడు యూనివర్శిటీలకు చోటు దక్కింది. అందులో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (గౌహతి), యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ , అన్నా యూనివర్ళిటీలకు ఈ గౌరవం దక్కింది. ఐఐటికి 71-80 పాయింట్ల స్కేల్‌లో, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు 91-100 స్కేల్‌లో, అన్నా యూనివర్శిటీకి 91-100 స్కేల్ దక్కింది.
నీట్‌కు కోచింగ్
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ ప్రోగ్రాం పేరిట నీట్ ప్రవేశ పరీక్షకు లాంగ్‌టెర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్టు సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఎమ్సెట్‌లో కనీసం 75 మార్కులు, నీట్‌లో కనీసం 245 మార్కులు సాధించిన ఎస్సీ అభ్యర్ధులు లాంగ్‌టెర్మ్ కోచింగ్‌కు దరఖాస్త చేసుకునేందుకు అర్హులని అన్నారు.
బ్రెజిల్ సదస్సుకు సాయిలు
సెంట్రల్ యూనివర్శిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్సు విభాగం పరిశోధక విద్యార్థి పట్టెపు సాయిలు బ్రెజిల్ యూనివర్శిటీ ఆఫ్ సాలో పాలోలో జరిగే ఐఎఫ్‌టిఆర్ సదస్సుకు ఎంపికయ్యాడు. జెఆర్‌ఎఫ్ స్కాలర్‌షిప్‌ను కూడా సాయిలు పొందాడని వర్శిటీ అధికారులు చెప్పారు. అదే సదస్సులో పాల్గొనే అవకాశం గొంతేటి నవీన్‌కు కూడా దక్కింది నవీన్ సైతం థియేటర్ ఆర్ట్సు విభాగంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు.
గీతం లెక్చరర్‌కు అవార్డు
గీతం విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ ప్రసన్న లక్ష్మికి భాషా బోధనలో విశిష్ట అవార్టును చెన్నై వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సిఫార్సు చేసిందని ప్రొ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ చెప్పారు.
ఉస్మానియా పరీక్షలు వాయిదా
ఉస్మానియా యూనివర్శిటీ దూరవిద్య పరీక్షలు వాయిదా పడ్డాయి. 17న జరగాల్సిన పరీక్షలు 24కు, 19 వతేదీ పరీక్షలు 26వ తేదీకి, 21వ తేదీ పరీక్షలు 28వ తేదీకి, 24వ తేదీ పరీక్షలు 31కి వాయిదా పడ్డాయి.