రాష్ట్రీయం

పాఠ్యాంశంగా రామదాసు చరిత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 14: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయ నిర్మాత, పరమ భక్తాగ్రేసరుడు, ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ్భక్తరామదాసు (కంచర్లగోపన్న) చరిత్రపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపింది. 6వ తరగతి తెలుగువాచకంతో పాటు, ఉపవాచకంలో ఆయన చరిత్రను పొందుపర్చారు. భక్తరామదాసు తన కీర్తనతో శ్రీరామచంద్రస్వామినే ప్రత్యక్షం చేసుకున్న మహవ్యక్తి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం నిర్మాణం కోసం ఎన్నో కష్టాలు అనుభవించి చివరకు జైలు జీవితం అనుభవించిన భక్తరామదాసు తెలంగాణ రాష్ట్రంలో తొలి వాగ్గేయకారుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భక్తరామదాసు మందిరంపై, చరిత్రపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వాటిలో భాగంగా పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన నీటిపారుదల ప్రాజెక్ట్‌కు భక్తరామదాసు పేరు పెట్టి భక్తరామదాసు కీర్తిని రాష్టవ్య్రాప్తం చేశారు. అలాగే నేలకొండపల్లి గ్రామంలో భక్తరామదాసు జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించింది. ఇప్పుడు భక్తరామదాసు చరిత్ర 6వ తరగతిలోని తెలుగు వాచకం, ఉప వాచకంలో పాఠ్యాంశంగా చేర్చారు.