రాష్ట్రీయం

‘తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తగూడెం, జూలై 14: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటంలో తెలంగాణ పోలీసులు భారతదేశానికే ఆదర్శంగా నిలిచారని తెలంగాణ రాష్ట్ర హోం, జైళ్లు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి నాయిని నర్శింహారెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంజూరైన కేంద్ర ఆర్మీ బెటాలియన్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయం, గిరిజన ఐటిఐ కళశాల భవన నిర్మాణ పనులకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా దేశ స్థాయిలో తెలంగాణ పోలీసులు ఆధునికమైన వాహనాలు, సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ ద్వారా రాష్ట్రంలో నేరాలు అదుపు చేయనున్నట్లు తెలిపారు. పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం రూ.350 కోట్లు మంజూరు చేసిందన్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఇతర రాష్ట్రాలు మార్గదర్శకంగా మారాయని అన్నారు.