రాష్ట్రీయం

నా దందాలో వాళ్లే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: డ్రగ్స్ దందాలో ఈవెంట్ మేనేజర్లే కీలకం. పరిశ్రమను మత్తులోకి దించి డబ్బు చేసుకోడానికి వాళ్లకు ఎరవేశాను. భారీగా సొమ్ములు ముట్టజెప్పానంటూ డ్రగ్స్ కీలక సూత్రధారి కెల్విన్ వెల్లడించాడు. రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న మాదక ద్రవ్యాల కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తును వేగవంతం చేసింది. కేసులో కీలక నిందితుడు కెల్విన్ సహ ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న సిట్, శనివారం లోతుగా విచారించింది. కెల్విన్ వాంగ్మూలంలో నేరుగా సినీ పరిశ్రమను టార్గెట్ చేయటంతో, ఇండస్ట్రీలో తీవ్ర ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్స్ రాకెట్‌తో సంబంధమున్న 19మందికి నోటీసులు జారీ చేసేందుకు సిట్ సిద్ధమైనా, చివరి క్షణంలో 12కి కుదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కెల్విన్ ఇచ్చిన కీలక సమాచారంతో ఈవెంట్ మేనేజర్లపైనా దృష్టి సారించి, జాబితా సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. తాజాగా నటుడు రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు పేరు తెరపైకి రావడం, దాంతోపాటు ప్రముఖ సంగీత దర్శకుడు, అతని సోదరుడూ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరగటం కలకలం రేపుతోంది. పోలీస్ కస్టడీలోని కెల్విన్, ఖుద్దూస్, వహీద్‌లను శనివారం సాయంత్రం వరకూ సిట్ విచారించింది. ఆదివారం కూడా విచారించనున్నారు. బెన్ ద్వారా తమకు సినీ పరిశ్రమతో సంబంధాలు ఏర్పడ్డాయని నిందితులు వాంగ్మూలంలో పేర్కొన్నారు. కెల్విన్ ఫోన్ డాటాలో 2,261 మంది, నిఖిల్ శెట్టి ఫోన్ డాటాలో 1,478 మందితో సంబంధాలు నెరపినట్టు సిట్ గుర్తించింది. ఎల్‌ఎస్‌డి మాదక ద్రవ్యాన్ని జర్మనీ, నెదర్లాండ్ నుంచి తెప్పించేవాడినని, కొన్ని సందర్భాల్లో తాను విదేశాల్లో ఉంటే, ఫ్లయిట్ టికెట్ పంపించి మరీ రప్పించేవారని కెల్విన్ వాంగ్మూలంలో పేర్కొన్నట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. టాప్ హీరో, దర్శకుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు డ్రగ్స్ కోసం తన వద్ద క్యూకట్టేవారని కెల్విన్ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇద్దరు టాప్ హీరోలు, డైరెక్టర్ పేరు ప్రస్తావించటంతో, వాళ్లెవరన్న ఆసక్తి పెరిగింది. కెల్విన్, అనుచరుల కస్టడీ ముగిసిన తరువాత రెండో జాబితాలోని వారికి నోటీసులు జారీ చేయడంతోపాటు అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది. డ్రగ్ డీలర్లకు, ఇండస్ట్రీలోని ప్రముఖుల మధ్య వారథిగా ఓ అగ్ర హీరో ఉన్నట్టు సమాచారం. మూడు, నాలుగు రోజుల్లో రెండో లిస్టు విడుదలయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే నోటీసులు అందుకున్న వారు 19నుంచి 26 వరకు సిట్ అధికారుల ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.

చిత్రం.. నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు