రాష్ట్రీయం

రేపే రాష్టప్రతి ఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ అమరావతి, జూలై 15: సోమవారం జరగనున్న రాష్టప్రతి ఎన్నికలకు దేశవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి రోజు పూర్తిగా రాష్టప్రతి ఎన్నికలకే పార్లమెంటు కార్యకలాపాలు పరిమితమవుతాయి. బిజెపి నేతృత్వంలోని అధికార ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, 18 ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ల మధ్య ముఖాముఖి పోటీ జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్టప్రతి ఎన్నికల్లో ఓటు వేసే ఎలక్టోరల్ కాలేజిలో లోక్‌సభ, రాజ్యసభకు చెందిన సభ్యులతో పాటుగా వివిధ రాష్ట్రాల్లోని అసెంబ్లీ సభ్యులు ఉంటారు. ఎంపీ ఓటు విలువ దేశమంతటా కూడా ఒకే విధంగా 708గా ఉండగా, శాసన సభ్యుడి ఓటు విలువ మాత్రం ఆ సభ్యుడు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జనాభా ఆధారంగా
మారుతుంటుంది. ఉదాహరణకు దేశంలోనే అతి పెద్ద రాష్టమ్రైన యుపి ఎమ్మెల్యే ఓటు విలువ 208కాగా, అతి చిన్న రాష్టమ్రైన సిక్కిం శాసన సభ్యుడి ఓటు విలువ 7మాత్రమే. మొత్తం ఎలక్టోరల్ కాలేజి ఓట్లు 10,98,882గా నిర్ణయించగా, అందులో 50శాతం అంటే 5,49,442ఓట్లను దాటిన వారు గెలిచినట్లుగా ప్రకటిస్తారు.
సోమవారం జరగబోయే రాష్టప్రతి ఎన్నికల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోను ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి ఎస్ రాజాసదారాం హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాలును పోలింగ్ కేంద్రంగా నిర్ణయించారు. చీఫ్ ఎలక్టోరల్ అధికారి భన్వర్‌లాల్, పార్లమెంటు సెక్రటరీ జనరల్ తరఫున ప్రతినిధిగా వచ్చిన కేంద్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కార్యదర్శి సుశీల్ కుమార్ శనివారం అసెంబ్లీకి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం భన్వర్‌లాల్, సుశీల్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి సదారామ్, జాయింట్ సెక్రటరీ వి నరసింహారావుతో సమావేశమై ఏర్పాట్ల గురించి చర్చించారు. ఢిల్లీనుంచి వచ్చిన పోలింగ్ బాక్స్‌ను, స్ట్రాంగ్ రూమ్‌ను, పోలీసు బందోబస్తును పరిశీలించారు.
నేడు మాక్ పోలింగ్
కాగా, ముఖ్యమంత్రి కెసిఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలకు రాష్టప్రతి ఎన్నికకు సంబంధించి మాక్ పోలింగ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్టప్రతి ఎన్నిక జరుగుతుండడంతో పాటుగా మెజారిటీ పార్టీ ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికయిన వారయినందున ఈ ఎన్నికల్లో ఓటు వేయడం వారికి కొత్త అనుభూతేనని చెప్పవచ్చు. తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువను 708గా నిర్ణయించారు. రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలు, 17మంది లోక్‌సభ సభ్యులు ఉన్నారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు వారి సొంత రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించే వీలుంది.
తొలి ఓటు చంద్రబాబుదే..
సోమవారం జరగనున్న రాష్టప్రతి ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు, పార్లమెంటు, రాజ్యసభ సభ్యులు సిద్ధమవుతున్నారు. ఏపిలో అధికార తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షమైన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండూ ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌ను బలపరుస్తున్నాయి. ఈవిధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకే అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చరిత్రలో ఇదే తొలిసారి. గత రాష్టప్రతి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యుపిఏ అభ్యర్థికి మద్దతునీయకుండా ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్ర శాసనసభలో తెలుగుదేశం పార్టీకి 127మంది ఎమ్మెల్యేలు, ఆంధ్ర-తెలంగాణ నుంచి ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 18మంది లోక్‌సభ సభ్యులున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి శాసనసభలో 47మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు లోక్‌సభ, ఒక రాజ్యసభ సభ్యులున్నారు. సాంకేతికంగా రాష్ట్ర శాసనసభ్యుల ఓటు విలువను 159గా నిర్ణయించారు.
సోమవారం ఉదయం 10నుంచి సాయంత్రం 5గంటల వరకూ జరిగే రాష్టప్రతి ఎన్నికకు శాసనసభలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి, ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న కౌర్ శనివారం శాసనసభకు వచ్చి ఏర్పాట్లు పరిశీలించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ కూడా వచ్చి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్టప్రతి ఎన్నికలో ఏవిధంగా ఓటువేయాలన్న అంశంపై అవగాహన కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఆదివారం విజయవాడకు రావల్సిందిగా నాయకత్వం పిలుపునిచ్చింది. ఇదిలాఉండగా సోమవారం నాటి పోలింగ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలిఓటు వేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
మొదటి పేరు మీరాదే
ఇదిలా ఉండగా బ్యాలెట్ పేపర్‌లో మొదటి పేరు మీరాకుమార్, రెండో పేరు ఎన్డీఏ అన్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాల్సి ఉంటుంది కనుక తమకు ఇష్టమైన అభ్యర్థి పేరు పక్కన 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇష్టం ఉంటే రెండు అభ్యర్థి పేరు పక్కన 2అంకె వేయాలి. అక్షరాల్లో రాసినా, టిక్కు పెట్టినా ఓటు చెల్లదు.

చిత్రం.. పోలింగ్ ఏర్పాట్లపై తెలంగాణ సిఇవో భన్వర్‌లాల్‌తో చర్చిస్తున్న అసెంబ్లీ కార్యదర్శి సదారామ్