రాష్ట్రీయం

మొక్కలే.. మన ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: రాష్ట్రంలో బాగా మొక్కలు నాటితే వర్షాలు కురుస్తాయని, వర్షాలు రావడంతో పంటలు బాగా పండుతాయని, పంటలు పండితే ప్రజలంతా సంతోషంగా ఉంటారని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా ఒక్కరోజులోనే శనివారం దాదాపు 28 లక్షల మొక్కలు నాటారు. ప్రాథమిక పాఠశాల మొదలు యూనివర్సిటీల వరకూ అన్ని స్థాయి విద్యాసంస్థల్లో కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఇందులో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యానిపుణులు, ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాజ్‌భవన్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మొక్కలను నాటారు. తెలంగాణలో కరవు పారద్రోలేందుకు చేపడుతున్న హరితహారం గొప్ప కార్యక్రమమని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. గ్రీన్‌డే వల్ల పర్యావరణంపై పిల్లల్లో చైతన్యం పెరుగుతుందని, తద్వారా సమాజంలోనూ చైతన్యం వస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కరవు పారద్రోలేందుకు 230 కోట్ల మొక్కలను నాటేందుకు హరితహారం ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా విద్యాశాఖ మొక్కలు నాటే పండగను యజ్ఞంలా నిర్వహించిందన్నారు. మొక్కలు నాటడానికే పరిమితం కాకుండా, వాటిని సంరక్షించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులతో గ్రీన్ బ్రిగేడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. విద్యాశాఖ కార్యక్రమాలను గవర్నర్ నిండుమనసుతో ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు.
ఉస్మానియాలో..
ఉస్మానియా యూనివర్శిటీలో 130 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌బెల్ట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎస్ రామచంద్రం చెప్పారు. శనివారం జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒయు క్యాంపస్‌లో మొక్కలు నాటారు. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో కమిషనర్ ఎ అశోక్ మొక్కలు నాటి హరితహారం ప్రాముఖ్యతను వివరించారు.