రాష్ట్రీయం

దర్భంగా, రక్సాల్‌కు 12 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: అధిక రద్దీని నియంత్రించేందుకు గాను దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-దర్భంగా-సికింద్రాబాద్, హైదరాబాద్-రక్సాల్-హైదరాబాద్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు శనివారం ప్రకటించింది. ఈ నెల 18, 22, 25, 29 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి నెం.07007 ఎక్స్‌ప్రెస్ రైలు రాత్రి 10 గంటలకు బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో దర్భంగా నుంచి నెం.07008 రైలు ఈ నెల 21, 25, 28, ఆగస్టు 1న రాత్రి 10.10 గంటలకు బయలు దేరుతుందని రైల్వే తెలిపింది. అలాగే హైదరాబాద్ నుంచి రక్సాల్‌కు నెం.07005 నెంబర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 27 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెం.07006 రైలు రక్సాల్ నుంచి ఈ నెల 23, 30 తేదీల్లో రాత్రి 11.15కి బయలుదేరుతుంది. ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని వినియోగించుకోవాలని రైల్వే ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.