రాష్ట్రీయం

హోదా, విభజన బిల్లు హామీలపై పార్లమెంటులో పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 15: పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడకుండా పోరాడాలని, ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్ వైకాపా ఎంపీలను కోరారు. శనివారం ఇక్కడ లోటస్‌పాండ్ కార్యాలయంలో వైకాపా పార్లమెంట్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు సమావేశంలో ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన రైతు సమస్యలు, ప్రజల సమస్యలు, జిఎస్‌టి వల్ల చిన్న వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.16వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తామని కేంద్రం చెబుతుంటే, రాష్ట్రప్రభుత్వమేమో పోలవరం అంచనా వ్యయాన్ని రూ. 48 వేల కోట్లకు పెంచిందన్నారు. ఇంత పెద్ద వ్యత్యాసాన్ని రాష్ట్రప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుందనే దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ అడగాలని నిర్ణయించినట్లు చెప్పారు. పార్లమెంటు కమిటీ సమావేశం తర్వాత ఎంపి మేకపాటి రాజ్‌మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల ఆంధ్ర నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రుల హక్కు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. నంద్యాలలో చంద్రబాబు ఓటుకు రేటు కడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు స్పష్టం చేశారు. ఎంపి వరప్రసాద్ మాట్లాడుతూ విభజన తర్వాత చట్టంలోని దుగ్గరాజపట్నం పోర్టు, ఇతర అన్ని హామీలు నెరవేర్చాలని కోరనున్నట్లు చెప్పారు. ఎంపి విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మంత్రి అరుణ్ జైట్లీని కలిసి చేనేతకు జిఎస్‌టి నుంచి మినహాయించి ఇవ్వాలని కోరగా ఆర్ధిక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కర్నూలు ఎంపి బుట్టా రేణుక రాష్ట్ర మంత్రి లోకేష్‌ను కలవడంలో తప్పేమి లేదన్నారు. ఆమె వ్యక్తిగత కారణాల వల్ల సమావేశానికి రాలేకపోతున్నారని చెప్పారని, రాష్ట్ర పతి ఎన్నికల కోసం ఢిల్లీకి బయలుదేరుతున్నామన్నారు. అరకు ఎంపి గీత, నంద్యాల ఎంపి ఎస్పీవై రెడ్డి ఫిరాయింపులపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటికే 21 మంది వైకాపా ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను చేర్చుకున్నారని ఈ కష్టాల నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మేకపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపి వరప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఎప్పుడూ ఇలా నియోజకవర్గాలు పెంపు జరగలేదని తెలిపారు. 21 మంది ఎమ్మెల్యేలను తీసుకోవడంతో వారిని సంతృప్తి పరచడం కోసమే నియోజకవర్గాల పెంపుదల గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. నియోజకవర్గాల పెంపుపై ఉన్న శ్రద్ధ ప్రత్యేక హోదాపై చూపిస్తే బాగుంటుందన్నారు.
చిత్రం.. హైదరాబాద్‌లో శనివారం జరిగిన వైకాపా ఎంపీల సమావేశంలో మాట్లాడుతున్న వైఎస్ జగన్