రాష్ట్రీయం

టాలీవుడ్‌లో ప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: మాదక ద్రవ్యాల కేసులో రెండో జాబితా సిద్ధమైందని తెలియడంతో టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయోనని టాలీవుడ్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా కెల్విన్‌కు విదేశాల నుంచి డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారన్న కోణంలోనూ సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సినీ ప్రముఖులతోపాటు రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన పలువురి కుమారులు కూడా తన వద్ద డ్రగ్స్ తీసుకున్నట్టు కెల్విన్ తన వాంగ్మూలంలో పేర్కొనడంతో అందరూ ఆందోళనకు గురువుతున్నారు.
15 మందితో రెండో జాబితా సిద్ధం చేసిన సిట్ అధికారులు త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. కెల్విన్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్వయంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
ముగ్గురు నిందితులకు
ముగిసిన కస్టడీ
డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్, ఖుద్దూస్, వహీద్‌ల ఎక్సైజ్ కస్టడీ ముగిసింది. ఈ వ్యవహారంలో మరింత విచారణకు వీరిని శనివారం సిట్ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా కెల్విన్‌తో సహా మరో నలుగురిని మళ్లీ కస్టడీకి ఎక్సైజ్ సిట్ అధికారులు కోరనున్నట్టు ఓ సిట్ అధికారి తెలిపారు. కుందన్‌సింగ్, అమన్ నాయుడు, నిఖిల్‌శెట్టి, బెండెస్‌మెన్‌లను కస్టడీకి ఇవ్వాలని సోమవారం సిట్ అధికారులు కోరనున్నారు. కాగా రెండు రోజులపాటు కెల్విన్, ఖుద్దూస్, వహీద్‌లను సిట్ అధికారులు విచారించగా డ్రగ్స్ దందాలో మరో ఎనిమిది మంది పేర్లు వెల్లడించారు. జర్మనీ, నెదర్లాండ్ నుంచి ఆన్‌లైన్‌లో డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు కెల్విన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అయితే న్యాయవాది పక్కనే ఉండటంతో పూర్తి వివరాలు వెల్లడించలేకపోయారని, దీంతో మరోసారి కెల్విన్‌ను కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. ఇదిలావుండగా ఆదివారం డ్రగ్స్ కేసులో చర్యలకు సిద్ధమవుతున్న ఎక్సైజ్ అధికారులు పక్కా ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు కెల్విన్ విచారణలో విస్తుపోయే నిజాలు వెల్లడైనట్టు తెలిసింది. గోవా నుంచి రోడ్డు మార్గంలో నగరానికి డ్రగ్స్ రవాణా గత రెండేళ్లుగా జరుగుతుందని, విదేశాల నుంచి తెప్పించే డ్రగ్స్‌ను వేరే ముఠాతో వ్యాపారం చేయిస్తున్నట్టు కెల్విన్ వెల్లడించినట్టు తెలిసింది.

రాజకీయ నాయకుల
కుమారులకు నోటీసులు?
రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో కొత్త పేర్లు బయటపడుతున్నాయి. దీంతో ఎక్కడ తమ పేరు వస్తుందోనని రాజకీయ నాయకులు, ప్రముఖులంతా భీతిల్లిపోతున్నారు. కెల్విన్ 30 వాట్సాప్ గ్రూపుల ద్వారా డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ అంగీకరించారు. కొంతమంది సినీ హీరోలు, దర్శక, నిర్మాతలు, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన పిల్లలు కూడా తన వద్ద డ్రగ్స్ తీసుకున్నట్టు సిట్ విచారణలో కెల్విన్ వెల్లడించాడు. కాగా 15 మందితో రెండో జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు తరువాతే వారి పేర్లు బయటపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. దర్యాప్తు అనంతరం కెల్విన్ కాల్ లిస్టులోని ప్రముఖులందరికీ నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది.