రాష్ట్రీయం

తెలంగాణకు భారీ వర్షసూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వచ్చే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని చాలా జిల్లాల్లో వచ్చే 48 గంటల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇదే సమయంలో కోస్తాంధ్ర, గోవా, ఒడిషాలలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని వివరించారు.
గత 24 గంటల్లో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని ఐఎండి హైదరాబాద్ కేంద్రం తెలిపింది. మణుగూరు (ఖమ్మం)లో ఏడు సెంటీమీటర్లు, పినపాక (ఖమ్మం), శాయంపేట (వరంగల్)లలో ఆరేసి సెంటీమీటర్లు, ఆత్మకూరు, నల్లబెల్లి (వరంగల్)లలో ఐదేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే ఖమ్మం, వరంగల్‌తో పాటు రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు తదితర జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయని ఐఎండి హైదరాబాద్ డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి తెలిపారు. ప్రస్తుత వర్షాల వల్ల ఇటీవల రైతులు వేసిన పంటలకు ఉపయోగం ఉంటుందని వ్యవసాయ శాఖాధికారులు తెలిపారు.