రాష్ట్రీయం

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ఆమనగల్లు, జూలై 16: రంగారెడ్డి కడ్తాల్-తలకొండపల్లి రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్‌ను ఓవర్‌టేక్ చేయబోయి బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబం టిప్పర్ ఢీకొట్టి దాని వెనుక టైరు కిందపడి మృత్యువాత పడింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో భద్రయ్య (35), వంశీ (10), చరణ్ (8), అక్కడిక్కడే మృతి చెందగా, భద్రయ్య భార్య సరితకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన సరితకు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. భద్రయ్య మిడ్జిల్ మండలంలోని ఓ పౌల్ట్ఫ్రీంలో పనిచేస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు ఆమనగల్లు పోలీసులు తెలిపారు.