రాష్ట్రీయం

మన వాటా మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: శ్రీరామ్‌సాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) కాలువలన్నింటినీ పూర్తిస్థాయిలో సిద్ధం చేసి వచ్చే ఏడాది నుంచే వందశాతం ఆయకట్టుకు నీరు అందించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాల్వల ద్వారా 16 లక్షల ఎకరాలకు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు మొత్తంగా 40 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందాలని సూచించారు. గోదావరిలో తెలంగాణ వాటా ప్రకారం నీరు వాడుకోవడానికి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద వచ్చే ఏడాది నుంచే నీరు వాడుకునే వెసులుబాటు ఉందన్నారు. ప్రగతి భవన్‌లో సోమవారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, నీటిపారుదల మంత్రి టి హరీశ్‌రావులతో పాటు ఎస్‌ఆర్‌ఎస్‌పి ఇంజనీరింగ్ అధికారులతో సిఎం సమావేశం నిర్వహించారు. గోదావరిలో పుష్కలమైన నీరుందని, నిధుల కొరత లేదని ఈ పరిస్థితుల్లో రైతులకు సాగునీరు అందించలేకపోతే పాపం చేసినట్టేనని సిఎం వ్యాఖ్యానించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి నడిగూడెం వరకు 346 కిలోమీటర్ల మేరనున్న కాలువలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, దీనికి ఎన్ని నిధులు ఖర్చు చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల కింద 16 లక్షల ఎకరాలల్లో, ఎల్‌ఎండి దిగువన ఎనిమిదిన్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించాలని, వీటి పరిధిలో ఉన్న చెరువులన్నింటినీ నింపాలని ఆదేశించారు. పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, తుంగతుర్తి తదితర నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే చెరువులను రిజర్వాయార్లుగా మార్చే అవకాశాలను పరిశీలించి, అంచనాలు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల ద్వారా కూడా గోదావరి జలాలు వాడుకునేది 500 నుంచి 600 టిఎంసి మాత్రమేనన్నారు. ఈమాత్రం నీటిని వాడుకున్నా 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ద్వారా 16 లక్షలు, ఇతర ప్రాజెక్టుల ద్వారా 24 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి మేడిగడ్డ నుంచి గోదావరి నీటిని తోడడం ప్రారంభమవుతుందని, అక్కడి నుంచి మిడ్ మానేరు, ఎల్‌ఎండిలకు నీరు చేరాక తిరిగి అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలకు నీరు అందాలన్నారు. ఎల్‌ఎండి దిగువ భాగంలోనే ఎస్‌ఆర్‌ఎస్‌పి కింద 8.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా కాలువలు సరిగా లేవని, ఆరు వేల క్యూసెక్కుల సామర్ధ్యం మాత్రమే తట్టుకునేలా కాలువులు ఉన్నాయని, వీటి సామర్ధ్యం 8,500 క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఉండలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహారాష్టత్రో ఒప్పందం చేసుకోవడంతో కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామన్నారు. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో ఏడాదికి దాదాపు రూ. 35 వేల కోట్లు నీటిపారుదలకు ఖర్చు చేస్తున్నామని సిఎం వివరించారు.

చిత్రం.. మంత్రులు, ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్