రాష్ట్రీయం

సచివానాలయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: అతి తక్కువకాలంలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మించి రికార్డు సృష్టించామన్న గొప్పలతోపాటు, స్వయంగా నిర్మాణాలను పర్యవేక్షించిన మునిసిపల్ మంత్రి నారాయణ సారథ్యంలోని సీఆర్‌డిఏ ఎంత గొప్పగా వాటి నిర్వహణపై శ్రద్ధ చూపిస్తున్నదన్న వైనాన్ని తాజాగా కురుస్తున్న భారీ వర్షాలు బయటపెట్టాయి. కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలోని విపక్షనేత వైఎస్ జగన్ చాంబర్ పైనుంచి వర్షపు నీరు లీకైన వైనం ప్రభుత్వాన్ని అప్రతిష్ఠకు గురిచేసింది. ఎవరో కావాలనే పైనున్న పైపులను కోశారని చెప్పిన స్పీకర్ కోడెల, ఆ ఘటనపై సీఐడి విచారణకు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత దోషులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అసెంబ్లీలోనే వర్షం నీళ్లు లీకవడంపై జాతీయ మీడియాలోనూ చర్చ జరిగినా, ఇప్పటివరకూ ఆ నివేదిక వచ్చిన దాఖలాలు లేవు. అసెంబ్లీలో లీకేజీ ఘటన రోజు రాత్రి హడావిడిగా పత్రికా ప్రకటన విడుదల చేసిన సీఆర్‌డిఏ కమిషనర్, తమ సిబ్బంది అన్నీ సరిచేశారని, ఇకపై అసెంబ్లీ- సెక్రటేరియేట్ నిర్మాణాల లోపాలను సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఆ ఘటనతోనయినా మునిసిపల్ శాఖ, సీఆర్‌డిఏ మేల్కొని లీకేజీకాకుండా లోపాలను సరిదిద్దుతుందని ఆశించారు. కానీ మళ్లీ అదే నిర్లక్ష్యం కొనసాగడం బట్టి, అధికారులు గంభీర ప్రకటనలతో ప్రభుత్వం కళ్లకు గంతలు కడుతున్నారన్న వాస్తవం మంగళవారం లీకైన మంత్రుల చాంబర్లు నిరూపించాయి.
24 గంటల నుంచీ జోరున కురుస్తున్న వర్షం వెలగపూడి సచివాలయంలోని పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల చాంబర్లు, ఉద్యోగులు పనిచేసే రూములు పైనుంచి లీకయిన నీళ్లతో ఇబ్బందిపెట్టాయి. 4వ బ్లాక్‌లోని మంత్రులు దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు చాంబర్లు లీకైన నీళ్లతో కనిపించాయి. మంత్రి గంటా శ్రీనివాస్ యాంటీ రూములో సీలింగ్ తడిసి కిందకు ఊడిపడిపోయింది. మంత్రి ఉమాకు చెందిన సాగునీటి శాఖ విభాగంలో అనేకచోట్ల గోడల వెంబడి నీరు కారుతోంది. విధులకు ఆటంకం కలిగించడంతో అక్కడున్న నాలుగవ తరగతి సిబ్బంది బకెట్లు తీసుకువచ్చి ఎత్తిపోయడం కనిపించింది.
జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ చాంబరులో ఫర్నిచర్ మొత్తం వర్షపు నీటితో తడిసిపోయింది. దానితో సిబ్బంది బకెట్లతో నీటిని తొలగించేపనిలో పడ్డారు. 4వ బ్లాక్‌లో ఉన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవిన్యూశాఖ చాంబర్లలో కూడా సీలింగ్ ఊడిపడింది. ఆయా చాంబర్లలో విండోగ్లాసులు, పైఫ్లోర్ నుంచి నీళ్లు లీకవుతూ కనిపించాయి.
మంగళవారం సచివాలయం సమీపంలోని గ్రామాల్లో సాయంత్రం 6 వరకూ 4.3 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. మరో రెండు మూడురోజులు భారీ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. కేవలం 4 సెంటీమీటర్ల వర్షానికే సచివాలయంలో లీకేజీ పరిస్థితి ఇంత ఆందోళనకరంగా ఉంటే, ఇక మరో రెండుమూడు రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని, సీలింగ్ ఎప్పుడు ఎవరి మీద పడుతోందని ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.
అతి తక్కువ సమయంలోనే సచివాలయ- శాసనసభ నిర్మాణం చేశామని గొప్పగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, వాటిని చూపేందుకు రైతులు, జర్నలిస్టులను కూడా తీసుకువచ్చి వారికి లక్షల రూపాయల ఖర్చుతో విందు భోజనాలు పెట్టిన ప్రభుత్వం, తాజా పరిణామాలతో విపక్షాల విమర్శలకు గురైంది. లీజేజీ వెనుక భారీ ప్యాకేజీ ఉందని దానిపై సీబీఐ విచారణ జరిపించాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా డిమాండ్ చేశారు.
అయితే, సచివాలయం చాంబర్లలో లీకయిన నీళ్లు మంత్రులు, ఐఏఎస్ అధికారుల చాంబర్లు, ఉద్యోగుల రూముల్లోకి వచ్చిన వైనం మంగళవారం ఉదయం చానెళ్లలో హల్‌చల్ చేస్తున్నా.. మునిసిపల్ మంత్రి నారాయణ మాత్రం అది చాలా చిన్న విషయమేనని కొట్టి పారేశారు. దానికి పెద్దగా ప్రాధాన్యం లేదన్నట్లు మీడియాకు చెప్పారు. ‘ఇది చాలా చిన్న విషయం. భూతద్దంలో చూస్తున్నారు. శ్లాబ్‌పై ఉన్న డక్ షీట్ బయటకు రావడం వల్లే నీళ్లు లీకయ్యాయి. మనం కట్టుకున్న ఇళ్లలోనూ మొదట్లో లోపాలుంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. వర్షం తగ్గగానే రిపేర్లు చేయిస్తాం. నిర్మాణంలో ఎక్కడ లోపాలున్నా రెండేళ్లపాటు కట్టిన కంపెనీలే సరిచేస్తాయ’ని వ్యాఖ్యానించిన మంత్రి నారాయణ, తొలుత లీకుల గురించి తనకు తెలియదని చెప్పడం కొసమెరుపు.

చిత్రాలు.. మంత్రి అచ్చెన్నాయుడు చాంబర్‌లో ఊడిపడిన సీలింగ్‌ను శుభ్రం చేస్తున్న సిబ్బంది
*సచివాలయం ఫోర్త్ బ్లాక్‌లో కిటికీ ద్వారా వర్షపు నీరు లోపలికి వస్తున్న దృశ్యం