రాష్ట్రీయం

ముంచెత్తిన వాన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం మంగళవారం రాత్రి లేదా బుధవారం తెల్లవారుజాముకు ఒడిశా తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మరో రెండురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ (ఇంచార్జి) వైకె రెడ్డి వెల్లడించారు. వాయుగుండం కారణంగా నైరుతీ రుతుపవనాలు చాలా చురుకుగా ఉన్నాయని, దాంతో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయని వివరించారు. గత 24 గంటల్లో మధిర (ఖమ్మం)లో తొమ్మిది సెంటీమీటర్లు, బోనకల్లు(ఖమ్మం)లో ఎనిమిది, హయత్‌నగర్ (రంగారెడ్డి), కొయిడా (ఖమ్మం), చింతకం (ఖమ్మం)లలో ఏడేసి సెంటీమీటర్లు, గోల్కొండ, ఖమ్మం పట్టణం, హైదరాబాద్, శేరిలింగంపల్లిలలో ఆరేసి సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఒక మోస్తరు నుండి భారీగా వర్షం కురిసింది. ఎడతెరిపిలేని వర్షానికి రాజధాని అస్తవ్యస్తమైంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, సచివాలయం, లిబర్టీ, మాసాబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్, బేగంపేట, ప్యాట్నీ, ప్యారడైజ్, లక్డీకాపూల్, రాణిగంజ్ కూడళ్లు చిన్నసైజు చెరువులను తలపించటంతో భారీగా ట్రాఫిక్ జామైంది. నాలా లు, డ్రైనేజీల నుంచి వర్షం నీరు భారీగా హుస్సేన్‌సాగర్‌కు చేరడంతో సాగర్ నిండుకుండలా కనిపిస్తోంది. నీటి సామర్థ్యం 513.41 అడుగులుంటే, మంగళవారం సాయంత్రానికి 513.32 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఇక భారీ వర్షానికి భూపాలపల్లి జిల్లాలో జన జీవనం స్తంభించిపోయింది. మంగళవారం తెల్లవారుఝాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లనుంచి బయిటికి రాలేకపోయారు. అనేక ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు వర్షం కారణంగా సెలవులు ప్రకటించారు. వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తుండగా చెరువులకు జలకళ ఏర్పడింది. పెద్ద వాగులైన కొండాపురం, పాలెం, కంకలవాగుతో పాటు కొండ వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలెం ప్రాజెక్ట్ జలాశయం రికార్డుల స్థాయిలో వరద నీరు రావడంతో గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా అధికారులు ఉన్నత అధికారుల ఆదేశంపై అప్రమత్తం అయ్యారు. గ్రామ రెవెన్యూ అధికారులు, పరిపాలన అధికారులు వారి వారి పరిపాలన గ్రామాలలో వాగులు, చెరువులు లోతైన గోతులు వద్దకు పిల్లలు, పెద్దలు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేస్తూ బలహీనంగా ఉన్న ఇండ్ల వారిని అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించామని వెంకటాపురం తహశీల్దార్ భిక్షం తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని బయ్యారం పెద్ద చెరువు అలుగుపారుతుండగా తాజాగా కురవి మండలం మునే్నరు చెక్‌డ్యాం మత్తడిపడుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నీళ్లతో కళకళలాడుతున్నాయి. మెదక్ పట్టణం మంగళవారం వర్షం కారణంగా చిత్తడిగా మారింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఘణపురం ప్రాజెక్ట్ నిండి పొంగిపొర్లడంతో ఎంఎన్ కెనాల్, ఎఫ్‌ఎన్ కెనాల్స్ నీళ్లతో కళకళలాడుతున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వరుసగా రెండో రోజు మంగళవారం కూడా ఎడతెరపి లేకుండా ముసురు వర్షాల జోరు కొనసాగింది. సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు రెండు రోజులు నిరంతరాయంగా ముసురు వర్షాలు కురిశాయి.

చిత్రాలు.. మూసీ వరద ఉదృతితో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరిన కేతెపల్లి మూసీ ప్రాజెక్టు, రాజధానిలో చెరువులను తలపిస్తున్న రహదారులు