రాష్ట్రీయం

పెట్టుబడికి బెంగలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: వ్యవసాయానికి ఉచిత పెట్టుబడి సమకూర్చడంతో పాటు భూ రికార్డులు పారదర్శకంగా నిర్వహించే విధానం అమలుకు రైతు సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రైతు సంఘాల ఏర్పాటు, భూరికార్డుల సక్రమ నిర్వహణ అంశాలపై ప్రగతి భవన్‌లో మంగళవారం ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. రైతు సంఘాల ఏర్పాటుకు విధి విధానాలను సమావేశంలో ఖరారు చేసి ప్రకటించారు. రైతుకు గిట్టుబాటు ధరి కల్పించే బాధ్యత రాష్ట్ర రైతు సంఘానిదే. గిట్టుబాటు ధర లభించని పంటను రాష్ట్ర రైతు సంఘం కొనుగోలు చేయడానికి రూ.500 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నట్టు సిఎం వివరించారు. అలాగే ప్రభుత్వం గ్యారంటీ ఉండి మరో 10 వేల కోట్లను రాష్ట్ర రైతు సంఘానికి ఇప్పిస్తుందన్నారు. వ్యవసాయానికి ఉచిత పెట్టుబడిని ఇచ్చే కార్యక్రమంలోగానీ, భూ రికార్డుల నిర్వహణలో గానీ రైతులు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, నయా పైసా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా విధి విధానాలు ఖరారు చేసినట్టు సిఎం వెల్లడించారు.
విధి విధానాలు...
ప్రతి రెవిన్యూ గ్రామానికి ఒకటి చొప్పున గ్రామ రైతు సంఘం ఏర్పాటు. సమగ్ర రైతు సర్వే ఆధారంగా ప్రతీ రైతును సంఘంలో చేర్పించాలి. గ్రామ రైతు సమన్వయ సమితిలో 11మంది సభ్యులను ప్రభుత్వం నియమిస్తుంది.
రైతు సమన్వయ సమితిలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, మహిళా రైతులకు ప్రాతినిధ్యం. సమన్వయ సమితిలోని సభ్యులకు అదే గ్రామంలో తప్పని సరిగా భూమి కలిగి ఉండాలి.
* రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటను ప్రాసెస్ చేయడానికి రాష్ట్ర రైతు సంఘానికి ప్రభుత్వం పర్మిట్లు ఇప్పిస్తుంది. బియ్యం, పెసర్లు, కందులు, పప్పు, కారం పొడి, పసుపుపొడిని రైతు సంఘమే విక్రయిస్తుంది.
* భూ రికార్డులను సరిచేయడానికి గ్రామ రైతు సంఘాలు వేదిక కావాలి. భూ రికార్డులను సరిచేయడానికి అధికారులే గ్రామాలకు వస్తారు.
* భూముల క్రయ, విక్రయాలు మార్పిడీలు సరళంగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా ఉండాలి.
* భూమి కొనుగోలు చేసినా, విక్రయించినా రిజిస్ట్రార్ ఆ వివరాలను ఎమ్మార్వోలు, గ్రామ రైతు సంఘానికి తెలియజేయాలి. ఈ ప్రక్రియ నాలుగు రోజులలో ముగించి 15 రోజులలో ముటేషన్ జరగాలి. తర్వాత పాసు పుస్తకాలలో నమోదు చేసి ఇవ్వాలి.
* భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, పాసు పుస్తకాలు రైతులకు నేరుగా కొరియర్‌లో పంపించాలి.
* నిర్ణీత సమయంలో పాసు పుస్తకాలు జారీ చేయకున్నా, మ్యుటేషన్ చేయకున్నా ఆలస్యానికి సంబంధిత అధికారి నుంచి రుసుం వసూలు చేయాలి (టిఎస్-ఐపాస్ చట్టం మాదిరిగా).
* రైతు సంఘాల నిర్మాణం, భూ రికార్డుల స్పెషల్ డ్రైవ్‌పై అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించి దానికి అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించాలి.

చిత్రం.. మంగళవారం ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్