రాష్ట్రీయం

జిఎస్‌టిలోనూ మేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) అమలులోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచిందని సిఎం కె చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. చాలా రాష్ట్రాల్లో దీనిపై గందరగోళం, ఆందోళన నెలకొని ఉండగా, ఇది అమలులోకి వచ్చిన మొదటి పక్షం రోజులలోనే 90 శాతం మంది వాట్ ఖాతాదారులను జిఎస్‌టి పరిధిలోకి తీసుకొచ్చి అద్భుత ప్రగతి సాధించిందన్నారు. జిఎస్‌టిపై అవగాహన కల్పించి వ్యాపార వర్గాలు గరిష్ట సంఖ్యలో దీంట్లో రిజిస్టర్ చేసుకునేలా కృషి చేసిన అధికారులను మంగళవారం సిఎం అభినందించారు. రాష్టవ్య్రాప్తంగా వాట్ పరిధిలో 2.16 లక్షల మంది ట్రేడర్లు ఉండగా వీరిలో 1.92 లక్షల మంది జిఎస్‌టిలో నమోదు అయ్యారన్నారు. కేవలం 15 రోజుల్లో ఇంతటి పురోగతి సాధించిన అతి కొన్ని రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచిందన్నారు. జిఎస్‌టిపై ప్రజలు, వ్యాపార వర్గాల్లో నెలకొన్న అపోహలను తొలగించి సానుకూల అంశాలను వివరించాలని అధికారులకు తాను చేసిన సూచన ఫలప్రదమైందన్నారు. జిఎస్‌టితో లాభమా? నష్టమా? ఎవరికి లాభం? ఎంత మేరకు నష్టం? ఏ వస్తువుపై ఎంత జిఎస్‌టి పడుతుంది తదితర విషయాలను అధికారులు విడమరిచి చెప్పడంలో సఫలీకృతమ య్యారని అన్నారు. ముఖ్యంగా రూ.20 లక్షల లోపు టర్నోవర్ కలిగిన వ్యాపారులపై జిఎస్‌టి పడదని, అలాగే రూ.75 లక్షల వరకు వ్యాపారం చేసే వారిపై కేవలం ఒకే ఒక శాతం పన్ను పడుతుందని అవగాహన కల్పించడంతో అపోహలు తొలగిపోయాయన్నారు. జిఎస్‌టి ద్వారా వచ్చే ఆదాయంలో సగం వాటా రాష్ట్రానికే రానుండటంతో మేలే తప్ప నష్టం ఉండదని తాను ముందే విశే్లషించినట్టు సిఎం గుర్తు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలోని 91 సర్కిళ్ళలోని వ్యాపార వర్గాలు అందరినీ అధికారులు స్వయంగా కలిసి అవగాహన కల్పించడమే కాకుండా దీనిపై 51 సదస్సులు నిర్వహించారన్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుంచి రాత్రి పదిగంటల వరకు అధికారులు తీర్చుతున్నారని వివరించారు. ఇప్పటి వరకు దాదాపు 3 వేల మంది టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్లు చేశారన్నారు.
కొన్ని రంగాలను మినహాయించాలని ప్రధానిని కోరా
వస్త్ర, బీడీ, గ్రానైట్ పరిశ్రమలతో పాటు అభివృద్థి పథకాలపై జిఎస్‌టి భారం వేయవద్దని ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాసినట్టు సిఎం కెసిఆర్ వెల్లడించారు. ప్రజోపయోగ పనులకు సంబంధించిన పనులకు జిఎస్‌టిలో మినహాయింపులు, రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. పై రంగాలపై ఆధారపడే వారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారని, ఈ వర్గాలపై జిఎస్‌టి మోపడం సరికాదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు.