రాష్ట్రీయం

ఆ మూడుచోట్లే కీలక నిర్మాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో ఏ కార్యాలయాన్ని ఎక్కడ నిర్మించాలనే అంశంపై ప్రభుత్వానికి స్పష్టత వచ్చింది. రానున్న రోజుల్లో శాశ్వత సచివాలయాన్ని ఉద్ధండరాయుని పాలెంలో నిర్మించాలని నిర్ణయించారు. తొలుత సచివాలయాన్ని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేయాలని యోచించారు, అక్కడ సెజ్‌లు ఉండటంతో సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం బందర్ రోడ్డులోని లైలా కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయాలని చూశారు, అదీ సాధ్యం కాదని అధికారులు చెప్పడంతో దానివెనుకే ఉన్న ఆర్ అండ్ బి స్థలంలో నిర్మించాలని చూశారు. అదీ కుదరదని తేలడంతో అమరావతి టౌన్‌షిప్‌లో 60 ఎకరాల్లో నిర్మించాలని చూశారు, అవన్నీ ఇపుడు మారిపోయాయి. వెలగపూడి-మల్కాపురం-మందడం గ్రామాలకు దక్షిణ భాగాన వెలగపూడికి దగ్గర్లో తాత్కాలిక సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాళ్లాయపాలెంలో రాజ్‌భవన్‌ను, వెంగాయపాలెంలో అసెంబ్లీని నిర్మించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం ఎక్కడ ఉంటుందనే ఉత్కంఠ కూడా వీడింది. తాత్కాలిక సచివాలయం గుంటూరులోని వెలగపూడిలో నిర్మించాలని నిర్ణయించింది. 205, 206, 207, 208, 214 సర్వే నెంబర్లులోని 26 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుచేస్తారు. తాత్కాలిక సచివాలయానికి 14వ తేదీ నుండి ప్రభుత్వం టెండర్లు పిలవనుంది. 25 రోజుల పాటు వివిధ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి ,టెండర్లు ఖరారు చేసిన తర్వాత ఆరు నెలల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. ప్రీ ఫ్యాబ్రికేటెడ్, సిమ్మెంట్ లేదా ఐరన్ పద్ధతిలో తాత్కాలిక సచివాలయం నిర్మిస్తారు. అనేక ప్రాంతాల్లో భూసార పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం అతి తక్కువ లోతులోనే జలం రావడంతో చివరికి వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మించడం ఉత్తమమనే నిర్ణయానికి వచ్చింది. బుధవారం నాడు సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉప సంఘం కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. రానున్న రోజుల్లో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండతస్తుల్లో సచివాలయాన్ని నిర్మిస్తారు. ఇందుకోసం దాదాపు 180 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం మీద చూస్తే ఉద్ధండరాయుని పాలెం, తాళ్లాయిపాలెం, వెంగాయపాలెంలు సీడ్ క్యాపిటల్ కీలక ప్రాంతంగా ఉంటాయి.
హైదరాబాద్ సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో తాత్కాలిక రాజధాని అంశంతో పాటు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ,రెవిన్యూమంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ మంత్రి డాక్టర్ పి నారాయణ హాజరయ్యారు. వంద గజాలకు పైబడిన ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపులపై గతంలో జారీ చేసిన జీవోలపైనా సమావేశంలో చర్చించారు.