రాష్ట్రీయం

కృష్ణాడెల్టాకు జలకళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: పట్టిసీమ జలాలు, కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 13లక్షల ఎకరాల ఆయకట్టు కల్గిన కృష్ణాడెల్టా అంతటా జలకళ ఉట్టి పడుతోంది. పట్టిసీమ పుణ్యమా అని దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా జూన్ మాసంలోనే సాగునీరు విడుదలయింది. నాగార్జున సాగర్ జలాశయం నుంచి చుక్కనీరు దిగువకు రానప్పటికీ పట్టిసీమ నుంచి 16 టిఎంసిల నీరు బ్యారేజీకి, అటు నుంచి కాలువలకు చేరింది. గోదావరి జలాలతో జూన్ మాసాంతం నుంచి ముందుగా కృష్ణాజిల్లాలో వరినాట్లు ప్రారంభమయ్యాయి. దాదాపు ఏడున్నర లక్షల ఎకరాలు ఉండగా మరో నాలుగైదు రోజుల్లో వరినాట్లు దాదాపు పూర్తవుతాయని అంచనా. తొలిసారిగా సకాలంలో ఆయకట్టు చివరి భూములకు కూడా నీరు చేరటంతో రైతాంగంలో ఉత్సాహం పెల్లుబుకుతున్నది. కొద్ది రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తూ పంట పొలాల్లో నీరు కళకళ లాడుతుండటంతో అటు పట్టిసీమ, ఇటు పులిచింతల నుంచి నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుత సీజన్‌లో పులిచింతల నుంచి కేవలం మూడు టిఎంసిల నీరు రాగా, పట్టిసీమ నుంచి 16 టిఎంసిల నీరు చేరింది. ప్రస్తుతం పులిచింతల దిగువ మునేరు ఇతర వాగుల నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది.

చిత్రం.. కృష్ణా డెల్టాలో జోరుగా వరినాట్లు వేస్తున్న దృశ్యం