రాష్ట్రీయం

పూరి చెప్తేనే డబ్బులిచ్చా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: సినీ పరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంపై విచారణలో భాగంగా రెండో రోజు గురువారం కెమెరామెన్ (సినీమాటోగ్రఫి) శ్యాం కె నాయుడును సిట్ అధికారులు విచారించారు. ఐదున్నర గంటలపాటు సాగిన విచారణలో నాయుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో కీలక వ్యక్తి కెల్విన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఎక్సైజ్ శాఖ అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో బుధవారం ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ను విచారించిన సిట్ బృందం, గురువారం సినీటోగ్రఫీ శ్యాం కె నాయుడును పిలిచారు. కాగా నాయుడు తన తరపు న్యాయవాదితోపాటు కొంతమంది సన్నిహితులతో కలసి నాంపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. గురువారం ఉదయం గం. 10:30లకు ప్రారంభమైన విచారణ పలు దఫాలుగా కొనసాగింది. ఈ విచారణలో డ్రగ్స్ డాన్ కెల్విన్‌తో సంబంధాలపైనే అనేక ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. కెల్విన్ ముఠాకు సంబంధించిన వివరాలు, మాదకద్రవ్యాలు కెల్విన్ సరఫరా చేసేవాడా? లేక దళారులతో సరఫరా చేయించాడా? సినీ పరిశ్రమలో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి? వంటి ప్రశ్నలపైనే సిట్ అధికారులు దృష్టిసారించినట్టు తెలిసింది.
తనకు ఎలాంటి డ్రగ్స్ అలవాటు లేదని, విచారణకు సహకరిస్తానని కెమెరామెన్ శ్యాం కె నాయుడు స్పష్టం చేశారు. అయితే ఈ విచారణలో కీలక అంశం తెరపైకి వచ్చింది. సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పడం వల్లే కెల్విన్‌కు ఆన్‌లైన్‌లో డబ్బు పంపానని సిట్‌కు శ్యాం కె నాయుడు వివరించాడు. కాగా ఐదున్నర గంటల పాటు జరిగిన సుదీర్ఘ విచారణలో నాయుడు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాడని సిట్ అధికారులు మీడియాకు తెలిపారు. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని, ఎక్కడికి పారిపోవద్దు..విచారణ పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ను వదిలి వెళ్లకూడదని, తప్పని పరిస్థితి ఉంటే..అనుమతి తీసుకోవాలని సిట్ అధికారులు సూచించారు. కాగా శుక్రవారం నటుడు సుబ్బరాజును సిట్ విచారించనుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. సిట్ విచారణకు మూడు కొరియర్ సంస్థలు (డిహెచ్‌ఎల్, బ్లూడార్ట్, ఫెడెక్స్) హాజరయ్యాయి. కొరియర్ సంస్థల ప్రతినిధులు సిట్ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నిషేధిత డ్రగ్స్‌ను కొరియర్ ద్వారా సరఫరా జరుగకూడదని కొరియర్ సంస్థల యాజమాన్యాలకు లిఖితపూర్వక సూచనలు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ తెలిపారు.

చిత్రం.. సిట్ విచారణకు హాజరైన శ్యాం కే నాయుడు