రాష్ట్రీయం

చిరుద్యోగి ఆస్తి రూ.2 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 20: ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలపై గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీ బాల కుటుంబరావు ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. గుంటూరు, విజయవాడ, కృష్ణాజిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఏక కాలంలో కుటుంబరావు, ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించి భారీగా బంగారం, వెండి, నగదు, మోటారు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని పలుచోట్ల ఇళ్ళు, స్థలాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం మొత్తం వీటి విలువ సుమారు రెండు కోట్ల పైనే ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా మార్కెట్ విలువ ప్రకారం 15 నుంచి 20కోట్ల వరకు అక్రమాస్తులుగా గుర్తించారు. ఏసిబి డిజి ఆర్‌పి ఠాకూర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ కృష్ణలంకలోని ఏబి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న కుటుంబరావు ఇంటితోపాటు, కృష్ణాజిల్లా చల్లపల్లిలోని బంధువుల ఇళ్ళు, స్వస్థలమైన గుడివాడ దగ్గర మోటూరు గ్రామంలో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కృష్ణాజిల్లాకు చెందిన కుటుంబరావు 1994 మార్చి 15వ తేదీన అసిస్టెంట్ మార్కెటింగ్ సూపర్‌వైజర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆతర్వాత 2008లో పదోన్నతి పొంది సూపర్‌వైజర్ అయ్యారు. ప్రస్తుతం 2016 నుంచి గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నారు.
ఏసిబి గుర్తించిన అక్రమాస్తులివే
ఏసిబి దాడుల్లో కుటుంబరావుతోపాటు ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. కృష్ణలంకలో ప్రస్తుతం నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌ను పది లక్షలకు 2008లో తన పేరుతో కొనుగోలు చేశారు. అదేవిధంగా మచిలీపట్నంలో 2012లో కొనుగోలు చేసిన స్థలంలో 12్ఫ్లట్లతో భావన రెసిడెన్సీ నిర్మించారు. ఇక మచిలీపట్నంలో 323.77చదరపు అడుగుల ఇంటి స్థలం, కంకిపాడులో 360.75 చదరపు అడుగుల ఖాళీ స్థలం, ఇక్కడే మరోచోట 300చదరపు అడుగుల ఖాళీ స్థలం, బత్తినపాడులో 403చదరపు అడుగుల ఖాళీ స్థలం, పరిటాల వద్ద 403చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా మచిలీపట్నం టౌన్‌లో 339చదరపు అడుగుల స్థలం, ఇక్కడే మరోచోట 50.08చదరపు అడుగుల స్థలం కొనుగోలు చేసినట్లు సోదాల్లో వెల్లడైంది. ఇక చల్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో 0.43ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. ఇవికాకుండా భార్య మండపాటి వీరకుమారి పేరుతో హైదరాబాద్, విజయవాడలో నివాస గృహాలు, గుడివాడ, మచిలీపట్నం తదితర చోట్ల ఆరు ఖాళీ స్థలాలు, చల్లపల్లిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. కుటుంబరావు మామ శీరం చినకృష్ణ పేరుతో మచిలీపట్నంలో రెండు చోట్ల ఖాళీ స్థలాలు, కుమారుడు సూర్యతేజ పేరుతో కానూరు, విజయవాడలో నివాసగృహాలు ఉన్నాయి. వీటితోపాటు ఇంటిపై జరిపిన సోదాల్లో 15లక్షలు విలువైన 545గ్రాముల బంగారం, 1.20లక్షలు విలువైన మూడు కేజీల వెండి సామాగ్రి, 3.70లక్షలు విలువైన గృహోపకరణాలు, 75వేలు నగదు, ఐదు లక్షలకు పైగా విలువైన కారు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డిజిపి ఆర్‌పి ఠాకూర్ తెలిపారు.

చిత్రం.. సోదాలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు