రాష్ట్రీయం

అలసత్వాన్ని ఉపేక్షించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: శ్రీరామ్‌సాగర్ (ఎస్‌ఆర్‌ఎస్‌పి) కాలువల ఆధునీకరణ పనులకు మరో రూ.750 కోట్లు మంజురు చేయనున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు. ఈ మేరకు రెండు రోజులలో సమగ్ర అంచనాలతో ప్రతిపాదనలు పంపాలని మంత్రి ఎస్‌ఆర్‌ఎస్‌పి చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ పనులపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రధాన కాలువల సామర్థ్యం 8 వేల క్యూసెక్కులు ఉన్నప్పప్పటికీ 6 వేల క్యూసెక్కుల సామర్థ్యానికి మించి పారలేదన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి ప్రధాన కాలువ పూర్తిగా పూడుకుపోవడంతో చివరి ఆయకట్టులో ఉన్న భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగునీరు అందలేదన్నారు. చివరి ఆయకట్టుకు సాగునీరు అందించడానికి కాలువల ఆధునీకరణ పనులు చేపడుతున్నట్టు హరీశ్‌రావు వివరించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి చివరి ఆయకట్టుకు నీరు ఎందుకు అందడం లేదో స్వయంగా పర్యటించి తెలుసుకుంటానని మంత్రి చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి చిట్టచివరి ఆయకట్టుకు నీరు అందించడానికి కృషి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ల నుంచి ఎస్‌ఆర్‌ఎస్‌పి చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నమన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కిందనున్న 9.68లక్షల ఎకరాలకు నీరు అందించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. చివరి ఆయకట్టుకు నీరు అందించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కిందిస్థాయి ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అలసత్వాన్ని ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాలువల లీకేజిలను అరికట్టాలని, డిస్ట్రిబ్యూటరీలు, మైనర్, సబ్ మైనర్ కాలువలలో పేరకపోయిన పూడిక తొలగించాలని ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద ఈ పనులు చేపట్టాలన్నారు. లోయర్ మానేరు డ్యాం ఎగువ, దిగువన ప్రాంతాల్లో మరమ్మతులతో పాటు పురోగతిలో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. టేల్ టు హెడ్ ప్రకారం సాగునీటి పంపిణీ చేయాలన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల ఆధునీకరణ పనులను ప్రాజెక్టు పరిధిలోని వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. అవసరమైతే కలెక్టర్లు తమ వద్ద ఉన్న నిధులను అత్యవసర పనులకు వినియోగించుకోవాలని సూచించారు. రెవిన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని, చుక్క నీరు వృథా కాకుండా చూడాలన్నారు. ఈ డిసెంబర్ నెలాఖరుకల్లా మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరు డ్యామ్‌కు నీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరంతో ఎస్‌ఆర్‌ఎస్‌పిని అనుసంధానం చేస్తామన్నారు.
డిసెంబర్‌కల్లా ఉదయ సముద్రం పూర్తి
నల్లగొండ జిల్లాలో ఉదయ సముద్రం ప్రాజెక్టును ఎట్టిపరిస్థితులలో డిసెంబర్‌కల్లా పూర్తి చేయాలని మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. జల సౌధలో గురువారం ఉదయ సముద్రం పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి డిసెంబర్‌కల్లా 50 వేల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు 60 చెరువులను నింపాలని ఆదేశించారు.

చిత్రం.. అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు