రాష్ట్రీయం

ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం బహుమతులు, ఇంక్రిమెంట్ల పేర్లతో ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లాస్థాయిలో 124 మందికి, రాష్టస్థ్రాయిలో హెచ్‌ఓడిల నుండి నలుగురికి, రాష్ట్ర సచివాలయం నుండి నలుగురికి బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. శాస్ర్తియంగా ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేస్తారు. ఇన్‌సెంటివ్ కమిటీ చైర్మన్ బిపి ఆచార్య నేతృత్వంలో గురువారం సచివాలయంలో కమిటీ సభ్యులు సమావేశమై నిర్ణయాలు తీసుకున్నారు. పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, జిఎడి ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్హా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి కె. రామకృష్ణారావు, హైదరాబాద్ ఇంచార్జి కలెక్టర్ ప్రశాంతి, వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి, కమిటీ కన్వీనర్ జిఎడి ముఖ్యకార్యదర్శి శాలినీ మిశ్రా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ట్రెజరీ నుండి వేతనాలు తీసుకుంటున్న ఉద్యోగులంతా ఈ స్కీంకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని ప్రకటించారు. ఈ నెల 21 నుండి 31 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో (తెలంగాణ.జిఓవి.ఇన్) పోర్టల్‌కు పంపించాల్సి ఉంటుంది. ఈ ఇనె్సంటివ్‌లకు 31 జిల్లాల్లో క్లాస్-4, క్లాస్-3, క్లాస్-బి (గ్రూప్-2), క్లాస్-1 (గ్రూప్-1) కేటగిరీల్లో 124 మందిని ఎంపిక చేస్తారు. వీరి ఎంపిక జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ చేస్తుంది. జిల్లాస్థాయి కమిటీ నలుగురిని ఎంపిక చేసి రాష్టస్థ్రాయి కమిటీకి సిఫార్సు చేస్తుంది. జిల్లాస్థాయిలో ఎంపికయ్యే వారికి ఒక అదనపు ఇంక్రిమెంట్, కమెండేషన్ లెటర్, సర్వీస్‌పుస్తకంలో అప్రిసియేషన్ నమోదు చేస్తారు. 31 జిల్లాల నుండి ఎంపికయ్యే 124 ఉద్యోగుల నుండి రాష్టస్థ్రాయిలో 12 మందిని ఎంపిక చేస్తారు. ఒక్కో కేటగిరీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేస్తారు. ఈ 12 మందికి ప్రోత్సాహకాలను ఆగస్టు 15న ముఖ్యమంత్రి అందిస్తారు. రాష్టస్థ్రాయిలో మొదటిస్థానం పొందిన వారికి ఐదు లక్షల రూపాయల నగదు, రెండోస్థానం పొందిన వారికి మూడులక్షల నగదు, మూడోస్థానం పొందిన వారికి రెండులక్షల రూపాయల నగదుతో పాటు పురస్కారాలు అందిస్తారు.
వేర్వేరు డైరెక్టరేట్ల నుండి నలుగురిని, సచివాలయం నుండి నలుగురిని ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసేవారు గతంలో నిర్వహించిన ఉత్తమ సేవలకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఫోటోలు తదితర వివరాలతో పాటు, 500 పదాలకు మించకుండా వివరాలు రాసి పంపించాలని బిపి ఆచార్య కోరారు.