రాష్ట్రీయం

చంద్రబాబునాయుడు హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 20: రాష్టప్రతిగా రామ్‌నాధ్‌కోవింద్ ఎన్నిక కావడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తం చేశారు. గురువారం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనలో భాగంగా గుడుపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో సిఎం పాల్గొన్నారు. ఈసందర్భంగా రాష్టప్రతి రామ్‌నాధ్ కోవింద్ గెలిచినట్టు సమాచారం అందడంతో ఆయనకు అభినందనలు తెలిపారు. దేశంలో అత్యున్నత పదవికి ఎన్నికలు జరగడం బాధాకరమన్నారు. అమరావతిలో తొలిసారిగా రాష్టప్రతి ఎన్నికలలో అందరూ రామ్‌నాధ్‌కోవింద్‌కు మద్దతు పలకడం గొప్పవిషయమన్నారు. ఉపరాష్టప్రతి ఎన్నికలలో కూడా ఇదే ఫలితాలు వస్తాయని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రామ్‌నాధ్‌కోవింద్ రాష్టప్రతిగా వనె్నతెస్తారని కొనియాడారు.