రాష్ట్రీయం

గోదావరి పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 20: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. రెండు రోజుల క్రితం 22 అడుగులకు చేరుకున్న గోదావరి క్రమేణా తగ్గుముఖం పట్టి తిరిగి పెరుగుతోంది. గురువారం రాత్రికి 36 అడుగులకు చేరుకుంది. ఎగువ భాగంలోని ఛత్తీస్‌గఢ్, మహారాష్టల్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రావతి, తాలిపేరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చర్ల వద్ద తాలిపేరు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో ఏడు గేట్లు ఎత్తి 75 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి 43 అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం ఆ స్థాయికి గోదావరి నీటిమట్టం చేరుకుంటోందని కేంద్ర జల సంఘం అధికారులు పేర్కొంటున్నారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం మండలాల పరిధిలోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలంలోని లోతట్టు ప్రాంతంలోకి నీరు చేరుతోంది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని కూనవరం, విఆర్‌పురం మండలాల్లో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.