రాష్ట్రీయం

రెండో లిస్ట్ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: మత్తు పదార్థాల (డ్రగ్స్) కేసులో నటుడు సుబ్బరాజు పోలీసు విచారణలో ఏం చెప్పాడు? సినీ పరిశ్రమ గుట్టు విప్పాడా? మూడో రోజు విచారణతో బడాబాబుల పేర్లు బయటకు రానున్నాయా? అనే అనుమానాలు పరిశ్రమలోని కొందరిని తొలిచేస్తున్నాయి. అందుక్కారణం ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అనుసరిస్తున్న విచారణ తీరే. శుక్రవారం నాటికి ముగ్గురి విచారణ పూర్తిచేసిన సిట్, అనూహ్యమైన సమాచారానే్న రాబట్టింది. అందులో భాగంగానే శుక్రవారం సిట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతూ మరో 15మందికి నోటీసులు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. తొలిరోజు పూరి జగన్నాథ్, రెండో రోజు కెమెరామెన్ శ్యాం కె నాయుడిని ‘సిట్’ అధికారులు గంటలపాటు గుచ్చిగుచ్చి విచారించిన విషయం తెలిసిందే. ఇక శుక్రవారం నటుడు సుబ్బరాజును రెండు విడతలుగా విచారింటమే కాదు, 12 గంటల సమయం తీసుకోవడం కూడా సినీ పరిశ్రమ గుండెల్లో గుబులు పుట్టడానికి కారణంగా కనిపిస్తోంది. విచారణకు హాజరైన ముగ్గురూ తొలుత తమకేమీ తెలీదన్న సమాధానాలే ఇచ్చారు. తరువాత సిట్ బలమైన ఆధారాలు చూపించి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తుండటంతో అసలు విషయాలు బయటపెట్టారు. నటుడు సుబ్బరాజు విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది. మొబైల్ ఛాటింగ్, కెల్విన్‌తో ఫోన్ సంభాషణలు, మెయిల్ రెక్వెస్ట్‌లు పంపడం, పోస్టల్ పార్సిళ్ల వంటి అనేకానేక ఆధారాలను సుబ్బరాజు ముందు సిట్ అధికారులు పెట్టడంతో, మత్తు సంబంధాలను అంగీకరించక తప్పలేదని తెలుస్తోంది. ఎటూ తప్పించుకోలేని పరిస్థితుల్లో విచారణకు సహకరిస్తూ, అడ్రసులతో సహా డ్రగ్స్ దందా వివరాలు బయటపెట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కీలక వివరాలు సేకరించటంపైనే దృష్టిపెట్టిన సిట్, సుబ్బరాజు విచారణకూ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకుంది. డ్రగ్స్ వినియోగం ఎలా జరిగేది? ఎక్కడి నుంచి కొనుగోలు చేసేవారు? కెల్విన్‌తో సినీ పరిశ్రమలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి’ అన్న అంశాలపై అధికారులు లోతైన ప్రశ్నలు సంధించి సమాచారం రాబట్టినట్టు చెబుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖుని కుటుంబంలో ఇద్దరికి డ్రగ్స్ వినియోగించే అలవాటుందని చెప్పడంతో అధికారులే ‘షాక్’కు గురయ్యారని చెబుతున్నారు. ఇంకా 15మంది వరకు నటీ నటులున్నట్టు సుబ్బరాజు ఇచ్చిన సమాచారం, సిట్ దగ్గరున్న అనుమానితుల పేర్లతో సరిపోలడంతో ఆయా వ్యక్తులకూ నోటీసులు జారీ చేసే పనిలో సిట్ నిమగ్నమైంది. సుబ్బరాజు వెల్లడించిన వివరాలతో ‘సిట్’ పనిభారం మరింత పెరిగింది. ఆయన వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రాథమిక విచారణ జరిపి, తర్వాతే నోటీసులు జారీ చేయాల్సి ఉంటుందని అంటున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేకుండా తొందరపడి నోటీసులిస్తే, పర్యావసనాలు తీవ్రంగా ఉండొచ్చన్న అంశంపైనా అధికారులు సీరియస్‌గానే దృష్టి పెడుతున్నారు. ఇదిలావుంటే, గంటలపాటు సుబ్బరాజును విచారించిన సిట్ బృందం అతని రక్తనమూనాలను తీసుకున్నారు. సిట్ సమక్షంలోనే ఉస్మానియా వైద్యులు సుబ్బరాజు రక్త నమూనాలు సేకరించారు.
మళ్లీ పిలిచినా వస్తా: సుబ్బరాజు
పనె్నండు గంటలపాటు సిట్ విచారణ ఎదుర్కొన్న నటుడు సుబ్బరాజు, అనంతరం మీడియాతో మాట్లాడారు. వారం క్రితం సిట్ తనకు నోటీసులిచ్చిందని, ఈరోజు నిర్వహించిన విచారణలో పూర్తిగా సహకరించానని చెప్పారు. మళ్లీ విచారణకు సిట్ పిలిస్తే తప్పక వస్తానని స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసును సిట్ సీరియస్‌గా తీసుకుందని, త్వరలోనే ‘మత్తు’ను పూర్తిగా దించేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌తో పిల్లల జీవితాలూ ప్రభావితం అవుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
చట్టం ప్రకారమే..: సబర్వాల్
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతూ తాను చట్టం ప్రకారమే నడుచుకుంటున్నట్టు చెప్పారు. కేవలం సినీ పరిశ్రమనే లక్ష్యంగా చేసుకున్నారంటూ వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. తాను అతిగా ఎక్కడా చేయలేదని, సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరుపుతున్నామని చెప్పుకొచ్చారు. సబ్బరాజు చెప్పిన ఆధారాలకు అనుగుణంగా మరోసారి పరిశీలన చేసుకుని మరి కొందరికి సోమ, మంగళవారాల్లో నోటీసులు పంపుతామని వెల్లడించారు. కెల్విన్ నేతృత్వంలోని రాకెట్ పట్టుబడడంతో అనేక విషయాలు బయటికి వచ్చాయని ఆయన తెలిపారు. విద్యా సంస్థలు, సాఫ్ట్‌వేర్ కంపెనీలున్న ప్రాంతాల్లోనూ డ్రగ్స్ వినియోగించే వారున్నారా? అనే కోణంలో నిఘా పెట్టినట్టు ఆయన చెప్పారు.
నేడు బార్లు, పబ్ యాజమాన్యాలతో భేటీ
స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీం (సిట్) అధికారులు శనివారం ఉదయం 11 గంటలకు జంట నగరాల్లోని పబ్బులు, బార్ల యజమానులు/ మేనేజర్లతో సమావేశం కానున్నారు. యువతను మత్తు పదార్థాలకు బానిసలుగా చేసి, జీవితాలను నాశనం చేయొద్దంటూ కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తప్పవనీ హెచ్చరించనున్నారు.

చిత్రం.. సిట్ విచారణకు హాజరవుతున్న నటుడు సుబ్బరాజు