రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లోనే ఐటి రిటర్న్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 21: రానున్న మరో నాలుగేళ్లలో ప్రాంతాల సరిహద్దుల్లేకుండా దేశంలో ఎక్కడినుంచైనా ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేయవచ్చని తెలుగు రాష్ట్రాల ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామప్రసాద్ చౌదరి వెల్లడించారు. ఇందుకు ప్రత్యేకంగా కమిటీని నియమించినట్టు చెప్పారు. శుక్రవారం రెడ్‌హిల్స్‌లోని ఐటి టవర్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదాయ పన్ను చెల్లింపుపై అవగాహన పెంపొందించేందుకు ఈనెల 24న ఆదాయ పన్ను దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆదాయ పన్ను అంటేనే భయపడతారని, ఆ భయాన్ని దూరంచేసి ఫ్రెండ్లీగా పన్ను వసూలు చేసేందుకు, ప్రజలే ముందుకొచ్చి చెల్లించేలా వారిలో అవగాహన పెంచేందుకు ఈనెల 24న జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో ఆదాయ పన్ను దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. తమ శాఖ సిబ్బంది, పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలతో కలిసి నిర్వహించే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్టు చెప్పారు. 2010లో మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ ఆదాయ పన్ను దినోత్సవ వేడుకలను మళ్లీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం పన్ను వసూళ్లలో తెలంగాణ 4 శాతం కాగా, ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం ఒక్కశాతం ఉన్నట్టు వివరించారు. ఏటా అడ్వాన్సు ట్యాక్సు వసూళ్లలో 24.3 శాతం, టిడిఎస్ అడ్వాన్సు టాక్సు వసూళ్లలో 24.24 శాతం వృద్ధి సాధించామన్నారు.
అవగాహన కోసం పోటీలు
ఆదాయ పన్ను చెల్లింపులు, వసూళ్ల వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా పలు పాఠశాల్లోని ఎనిమిది నుంచి పనె్నండవ తరగతి విద్యార్థులకు పెయింటింగ్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వ్యాసరచన తదితరంశాల్లో పోటీలు నిర్వహించామని, ఇందులో విజేతలకు 24న నిర్వహించే ఆదాయ పన్ను దినోత్సవంలో బహుమతులు ప్రదానం చేయనున్నట్టు చౌదరి వివరించారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులు, కంపెనీల సెక్రటరీలు వంటి ఇతరత్ర ఆదాయ పన్ను సంబంధిత విధులు నిర్వర్తించే సుమారు 600 మంది హజరయ్యే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆదాయ పన్ను వసూళ్లలో వచ్చిన మార్పులువంటి అంశాలపై ప్రజెంటేషన్ ఉంటుందని తెలిపారు.

చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ శ్యామప్రసాద్ చౌదరి