రాష్ట్రీయం

రుణాలు.. 121744 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: రాష్ట్రంలో 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యతా రంగాలకు 1,21,744 కోట్ల మేర రుణాలివ్వటానికి నాబార్డు ప్రణాళికను ఖరారు చేసింది. బుధవారం నగరంలోని ఒక హోటల్‌లో రాష్టస్థ్రాయి రుణ సదస్సు జరిగింది. రుణ ప్రాధాన్యత పత్రాన్ని సిఎం చంద్రబాబు ఆవిష్కరిస్తూ ‘వ్యవసాయ రంగంలో పెట్టుబడుల వృద్ధి’ అంశంపై మాట్లాడారు.
వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో లక్ష్యాలు చేరుకోడానికి రుణ మొత్తాన్ని మరింత పెంచాలన్నారు. సాగు రంగంలో రూ.52 వేల కోట్లు, ఉద్యానవన రంగంలో 44 వేల కోట్లు, డెయిరీ పరిశ్రమలో 25 వేల కోట్లు, పశు సంవర్థక రంగంలో 14 వేల కోట్లు, మత్స్య పరిశ్రమలో 30 వేల కోట్లు కేటాయిస్తున్నారంటూ, బ్యాంకుల భాగస్వామ్యం ఆశించినంతగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దఎత్తున రుణాలనందించి వ్యవసాయ రంగాన్ని లాభసాటి చేసే ప్రక్రియలో సహకరించాలని బ్యాంకర్లను కోరారు. ప్రభుత్వం ఒక వైపున పెద్ద ఎత్తున జల సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను లాభసాటిగా మార్చేందుకు పట్టుదలతో కృషి చేస్తున్న వైనాన్ని సిఎం గుర్తు చేశారు. ఇటీవలే ‘పంట-కుంట’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి భూగర్భ జలాలను గణనీయంగా పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు అవసరమైన రుణాలు అందించాలన్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలలో భాగస్వాములందరినీ ఒకచోటకి చేర్చి ఇలాంటి ఉపయుక్తమైన చర్చల ద్వారా రుణ ప్రాధాన్యతను నిర్ణయించడం సహేతుకంగా ఉంటుందన్నారు.
బ్యాంకులు ఇచ్చిన రుణ ప్రణాళికలు, ఆమేర అందించిన చేయూత గురించి ఈ సమావేశంలో ఆప్కాబ్ ఛైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు నుంచి ముఖ్యమంత్రి వివరాలడిగి తెలుసుకున్నారు. రైతులు రుణాలు తీసుకునే సమయంలో స్టాంపు డ్యూటీ చెల్లింపు మినహాయింపుపై ఆలోచన చేయాలని పలువురు ప్రతినిథులు సిఎంను కోరారు. ఈ సమావేశంలో నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ హరీస్ జవా, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబ రావు, ఆంధ్రాబ్యాంకు ఎండి సురేష్ ఎన్ పటేల్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి.విజయకుమార్, ఇతర అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
చిత్రం...

విజయవాడలో నాబార్డు సమావేశంలో మాట్లాడుతున్న సిఎం చంద్రబాబు