రాష్ట్రీయం

రైతులుగానే ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 22: మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణలో ఏడాదిగా కొనసాగుతున్న రైతుల నిరసనకు తెరదించేందుకు సిఎం కెసిఆర్ రంగప్రవేశం చేశారు. భూనిర్వాసితులైన వేములఘాట్ గ్రామస్తులు 400 రోజులుగా రిలే దీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాలకు చెందిన రైతులను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రానికి పిలిపించుకుని అభిప్రాయాలు తెలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన 186మంది రైతులు సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వేములఘాట్‌కు చెందిన ఉద్యమ నాయకుడు అయితోద్దీన్ సిఎంతో జరిగిన చర్చలను వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు భూములు అప్పగించాలని సూచించారన్నారు. తమకు ఆర్థికంగా ఎలాంటి నష్ట పరిహారం అక్కర్లేదని రైతులు ముక్తకంఠంతో సిఎంకు విన్నవించారు. 1200 ఎకరాల భూమి రిజర్వాయర్ నిర్మాణంలో మునిగిపోతుందని, తమకు ముల్లే మూట ఏమీవద్దని భూమికి భూమి అప్పగించి రైతులుగా బతకనిస్తే సంతోషిస్తామని వివరించినట్టు చెప్పారు. ఏటా రెండు పంటలు పండించి కుటుంబాలను సంతృప్తికరంగా పోషించుకుంటున్నట్టు వివరించామన్నారు. భూమికి భూమి, ఊరుకు ఊరు అప్పగిస్తే తాము ఖాళీ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పామన్నారు. తరతరాల నుంచీ పూర్వీకులు అనుభవించిన ఆస్తినే తాము అనుభవిస్తూ బతుకుతున్నామని మాది రైతు గ్రామమని, రైతులుగానే బతకనివ్వాలని సిఎంను వేడుకున్నట్టు చెప్పారు. ఏ జిల్లా అయినా సరే ఇక్కడ ఎంత భూమి కోల్పోతున్నామో అక్కడా అంతే భూమి కేటాయించి పునరావాసం కల్పిస్తే భూములు ఇవ్వడానికి సిద్ధమేనని చెప్పామన్నారు. నిర్వాసితులను గ్రామాల నుంచి వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లడానికి బస్సు సౌకర్యం కల్పిస్తామంటే రైతులు నిరాకరించారు. ఎవరికి వారే సొంత వాహనాలపై ఎర్రవల్లికి చేరుకున్నారు. సిఎంను కలిసేందుకు మధ్యాహ్నం 12 గంటలకు అవకాశం ఇవ్వడంతో, రైతులంతా ఇళ్లవద్దనే భోజనాలు చేసుకుని బయలుదేరారు. వ్యవసాయ క్షేత్రంలో నిర్వాసితుల కోసం భోజనాలు సిద్దం చేసినా తినకుండా వెనుదిరిగి రావడం గమనార్హం. రెండు పంటలు పండిస్తున్నామన్న విషయాన్ని సిఎం పరిగణనలోకి తీసుకున్నట్టు నేతలు వివరించారు. ఈమేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్‌తో సర్వే చేయించి తదుపరి ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేస్తామని నిర్వాసిత రైతులకు సిఎం వివరించారన్నారు. మొత్తంమీద ఏడాదిగా ఎటూ తేలకుండా ఉన్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ భూసేకరణ కార్యక్రమాన్ని కొలిక్కి తేవాలనే సంకల్పంతో సిఎం వచ్చినట్టు శనివారం రైతులతో నిర్వహించిన చర్చలే చెబుతున్నాయి. వ్యవసాయ క్షేత్రానికి వచ్చిన భూనిర్వాసితులను పోలీసులు మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తరువాతే లోపలికి అనుమతించటం గమనార్హం.

చిత్రం.. సిఎం కెసిఆర్