రాష్ట్రీయం

తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉపాధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 22: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగికీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర హోం, ఉపాధి శాఖల మం త్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఖమ్మంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా నాయిని మాట్లాడుతూ పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు చదువుకున్న వారందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో జాబ్‌మేళాలు నిర్వహిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయనివిధంగా సంక్షేమ, ఉపాధి కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపడుతోందని, అనేక రాష్ట్రాలు తమ పథకాలనే అమలు చేస్తున్నాయని అన్నారు. ఖమ్మంలో నిర్వహిస్తున్న మేళాలో 30 కంపెనీలు పాల్గొనడం అభినందనీయమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదోఒక రూపంలో లబ్ధి చేకూర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రయత్నిస్తున్నట్లు మంత్రి నాయిని వివరించారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో అతిపెద్ద జాబ్‌మేళాకు నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించిందని, వారందరికీ ఉపాధి కల్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సుమారు 4వేల మంది వరకు పాల్గొన్న ఈ మేళా మరోసారి నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. కెసిఆర్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తోందన్నారు.
ఎమ్మెల్యే కోసం మంత్రుల ఎదురుచూపు!
ఇద్దరు రాష్ట్ర మంత్రులు పాల్గొన్న కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడు పువ్వాడ అజయ్‌కుమార్ గైర్హాజరు కావడంతో ఆయన కార్యక్రమానికి వచ్చేంతవరకు వేచిచూశారు. నూతనంగా నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మొక్కలునాటేందుకు నాయినిని గతంలోనే అజయ్ ఆహ్వానించగా వస్తానని హామీ ఇచ్చి శనివారం పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆ కార్యక్రమానికి రాకుండా నేరుగా జాబ్‌మేళా వద్దకు చేరుకున్నారు. దీం తో ఆగ్రహించిన అజయ్ జాబ్‌మేళాకు గైర్హాజరయ్యారు. విషయం తెలుసుకున్న మం త్రు లు ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఆయన వద్దకు రాయబారం పంపి బుజ్జగించి, కార్యక్రమానికి వచ్చేలా చేశారు. అజయ్‌తోనే ఖమ్మం నగర పార్టీ నేతలంతా కలిసి రావడం పార్టీలోని విభేదాలను బహిర్గతపర్చింది. ఎమ్మెల్యే అజ య్ వచ్చిన తర్వాతే జాబ్‌మేళాను మంత్రులు ప్రారంభించడం గమనార్హం.