రాష్ట్రీయం

టిఆర్‌ఎస్ నేతలున్నా వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 22: డ్రగ్స్ మాఫియాపై ప్రభు త్వం లోతుగా దర్యాప్తు చేయిస్తోందని, అందులో టిఆర్‌ఎస్ నేతలున్నా, వారి వారసులున్నా వదిలేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖమ్మంలో శనివారం ఆయన మంత్రి తు మ్మల నాగేశ్వరరావుతో కలిసి విలేఖరులతో మాట్లాడుతూ జీవితాలను నాశనం చేస్తున్న డ్రగ్స్ మాఫి యా కాంగ్రెస్ పుణ్యమేనని ఆరోపించారు. గతంలోనే డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసి వుంటే ఇప్పుడీ పరిస్థితి దాపురించేది కాదన్నారు. ఇప్పటికే అనేకమందిని విచారిస్తున్నామని, పూర్తిస్థాయిలో విచారణ ముగిశాక దోషులను కఠినంగా శిక్షించేలా చూస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఆరోపణలు చేస్తున్నారని, ఆ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో చేయలేనిది తాము రెండేళ్లలో చేసి చూపిస్తున్నామన్నారు. అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ నిలయంగా మారిందని, వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తమ ప్రభుత్వంపై, పార్టీ నాయకులపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన ప్రభుత్వం వాటికి అనుగుణంగానే పనిచేస్తోందన్నారు. అవినీతి రహిత పాలన అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తున్నారని, ప్రతి తెలంగాణ బిడ్డకు లబ్ధి చేకూరేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూ కుంభకోణాలు, డ్రగ్స్ మాఫియాలను పూర్తిగా అణచివేస్తామని హోంమంత్రి నాయిని వివరించారు.

చిత్రం.. ఖమ్మంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి నాయిని