రాష్ట్రీయం

రైల్వేల్లో కారుణ్య నియామకాలకు రెండో భార్య సంతానం అర్హులే: హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: రైల్వే ఉద్యోగి రెండవ భార్య సంతానం కారుణ్య నియామకాలకు అర్హులేనని హైకోర్టు ప్రకటించింది. వీరి దరఖాస్తులను రైల్వే బోర్డు తిరస్కరించడాన్ని కోర్టు కొట్టివేసింది. ఐదు కేసుల్లో కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం, రెండవ వివాహం చెల్లదు, కాని వారికి జన్మించిన సంతానం మాత్రం కారుణ్య నియామకాల సమయంలో అర్హులేనని కోర్టు పేర్కొంనది. 2011 నుంచి 2016 వరకు ఈ తరహా కేసులో ఐదు వరకు హైకోర్టులో దాఖలయ్యాయి. గతంలో అలహాబాద్ హైకోర్టు కుమారి ప్రీతి గుప్తా వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో ఇచ్చిన తీర్పును హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. రైల్వే ఉద్యోగి హిందువై ఉండి మరణించిన తర్వాత ఆయన రెండవ భార్య సంతానానికి కారుణ్య నియామకం కింద ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే హక్కు ఉందని కోర్టు తెలిపింది. రైల్వే బోర్డు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు డిస్మిస్ చేసింది. తక్షణమే రెండో భార్య సంతానం కారుణ్య నియామకం కింద పెట్టుకున్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.