రాష్ట్రీయం

సమస్యలు పరిష్కరిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టిలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ ఎస్‌సి కమిషన్ సభ్యుడు కె. రాములు తెలిపారు. ‘ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయిస్’ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో రాములుకు సన్మానం జరిగింది.
ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, యునైటెడ్ ఫోరంను తెలంగాణ ప్రభుత్వం గుర్తించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్‌సి, ఎస్‌టి ఉద్యోగులపై ఎసిబి కేసులు నమోదు చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ అంశం తీసుకుపోయి పరిష్కరిస్తానని తెలిపారు. దళితులపై జరుగుతున్న దాడులను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్‌సి ఎస్‌టి ఎంప్లాయిస్ క్రమశిక్షణతో పనిచేస్తోందని, సమస్యలను లేవనెత్తడంలో నిరంతరం పాటుపడుతోందని గద్దర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో దళిత, గిరిజనులు రాజ్యాధికారం దిశగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు.
యునైటెడ్ ఫోరం ఎస్‌సిఎస్‌టి ఎంప్లాయిస్ జాతీయ అధ్యక్షుడు జిఎస్ కుమారస్వామి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఫోరం ముందు వరుసలో ఉంటుందని వెల్లడించారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫోరం సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, సిహెచ్. సంపత్ కుమారస్వామి, తెలంగాణ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు జి.నిర్మల, మాజీ డిడి సత్యనారాయణ, ఎసిపి మనోహర్, ఫోరం ప్రధాన కార్యదర్శి కొండల్‌రావు పాల్గొన్నారు.

చిత్రం.. ఆదివారం హైదరాబాద్‌లో జాతీయ ఎస్‌సి కమిషన్ సభ్యుడు రాముల్ని సన్మానిస్తున్న