రాష్ట్రీయం

ఆ పబ్బులు తెరాస నేతలవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: నగరంలో ఉన్న హై లైఫ్, టానిక్ పబ్స్ టిఆర్‌ఎస్‌కు చెందిన నేతలవేనని టిటిడిపి వర్కింగ్ ప్రెసిండెంట్ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మియాపూర్ భూ కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని వెలికి తీశారని ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆదివారం నాడిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రగ్ మాఫిలో ఉన్న పెద్దలను వదిలి చిన్న వాళ్లకే సిట్ నోటీసులు జారీ చేస్తోందని అన్నారు. గతంలో తాము నగరంలో పబ్‌ల గురించి, దాని వెనుక ఉన్న వారి గురించి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా అంశం, దాని దర్యాప్తు పై కేంద్ర ఏజెన్సీలైన డిఆర్‌ఐ, నార్కోటిక్ బ్యూరోకు ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు. ఈ కేసులో పెద్దలను వదిలి, చిన్న వాళ్లను టార్గెట్ చేసి కేసు మూసేయాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తక్షణమే ఈ కేసులో ఉన్న పెద్దలకు నోటీసులు జారీ చేసి, విచారించాలని డిమాండ్ చేశారు.