రాష్ట్రీయం

ఏపిలో 17న పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 17న పల్స్‌పోలియో కార్యక్రమం చేపడుతున్నామని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ తెలిపారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ, భారత్ నుండి పోలియో పూర్తిగా నిర్మూలించినప్పటికీ, సమీప దేశాల్లో ఇది ఉండటం వల్ల ముందు జాగ్రత్త చర్యగా పల్స్‌పోలియో చేపడుతున్నట్టు వెల్లడించారు.
జనవరి 17న 13 జిల్లాల్లోని పట్టణాలు, గ్రామాల్లో ఉన్న 37,201 పోలింగ్ కేంద్రాల్లో పల్స్‌పోలియో వేస్తామన్నారు. మొత్తం 52,45,617 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించామని, ఆ రోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పోలియో చుక్కలు వేయించుకోని వారికోసం జనవరి 18-19 తేదీల్లో ఇళ్లకు వెళ్లి వీటిని వేస్తారన్నారు. విశాఖ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లలలో జనవరి 20న పోలియో చుక్కలు వేస్తారన్నారు. ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ (తీవ్రఅస్వస్థతో ఉన్న పిల్లలు మినహా) పోలియో చుక్కలు వేయవచ్చని ఆయన వివరించారు.