రాష్ట్రీయం

పబ్‌ల లైసెన్సుల్నీ రద్దు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: హైదరాబాద్‌లో ఉన్న పబ్ లైసెనులన్నీ రద్దు చేయాలని టి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ మీడియా హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బహుమతి డ్రగ్స్ దందా అంటూ డ్రగ్స్ మాఫియాపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. డ్రగ్స్ మాఫియా నిర్మూలన పట్ల ప్రభుత్వం స్పందిస్తున్న మాదిరిగానే టెర్రరిజమ్ పైనా స్పందించాలని డిమాండ్ చేశారు. పబ్‌లను వ్యతిరేకిస్తూ పబ్‌ల వద్ద ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా పబ్‌లను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని అన్నారు.