రాష్ట్రీయం

ఆరోగ్య తెలంగాణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, జూలై 23: ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆరోగ్య తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ఖమ్మంలో 150 పడకల మాతా-శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదలకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందించేందుకు ఒక విజన్‌తో ముందుకు పోతున్నామని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో వైద్యసేవల్లో తాము ముందున్నామన్నారు. డయాలసిస్ విషయంలో గతంలో మాదిరిగా కాకుండా ఒక్కసారి డయాలసిస్ చేసిన తరువాత మళ్లీ ఆ పరికరాన్ని వాడకుండా పక్కన పడేస్తున్నామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఐసి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. 40 డయాలసిస్ సెంటర్లను సైతం ఏర్పాటు చేశామని, మిగతాచోట్ల కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే ఏజెన్సీ ప్రాంతాలు విషజ్వరాలతో అట్టుడికిపోయేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో విషజ్వరాలను పూర్తిగా అరికట్టగలిగామన్నారు. వైద్య రంగంలోనే సమూల మార్పులు తెచ్చి పాత ఆసుపత్రులను ఆధునీకరించి కొత్త ఆసుపత్రులను అత్యాధునికంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రజల శ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ డిఎస్ లోకేష్‌కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, మేయర్ పాపాలాల్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డిఎంహెచ్‌వో కొండల్‌రావు, ఖమ్మం ఆసుపత్రి సూపరిండెంటెంట్ మదన్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మాతా-శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మారెడ్డి