రాష్ట్రీయం

ఆగస్టులో ‘గామ్ ఆబాది’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితితులు తెలుసుకోవడానికి నిర్వహించిన సమగ్ర సర్వే తరహాలోనే భూముల వివరాలు, రికార్డులు, క్రయ, విక్రయాల ఆప్‌డేట్, పంటల సాగు తదితర అంశాలపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా భూ వివరాలను ‘గామ్ ఆబాది’పై సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల ఆగస్టులో ప్రారంభం కానున్న భూ సర్వే నిర్వహణకు సరిపడ ప్రభుత్వ సిబ్బంది లేకపోవడంతో 15 వేల మంది నిరుద్యోగుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి నెలకు రూ. 20 వేల వేతనం ఇచ్చి నియమించుకోవడానికి రెవి న్యూ శాఖకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆనుమతించారు.
సమగ్ర భూ సర్వే పూర్తి అయితే తప్ప పంటల సాగుకు ఎకరానికి రూ. 8 వేల చొప్పున ఉచిత పెట్టుబడి సమకూర్చడం సాధ్యం కాదని ప్రభుత్వ భావిస్తుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ నిర్వహించిన సమగ్ర సర్వేలో వెల్లడైన వివరాలను, తాజాగా నిర్వహించే గామ్ ఆబాదితో సరిచూసుకున్న తర్వాతనే వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పెట్టుబడి పథకాన్ని ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. భూ రికార్డులను సరి చేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను తిరిగి జారీ చేయాలని భావిస్తుంది. భూ రికార్డులను సరి చేసేందుకు ప్రభుత్వం త్వరలో నియమించబోయే గ్రామ రైతు సంఘాలు వేదికగా ఉండాలని నిర్ణయించింది.