రాష్ట్రీయం

టార్గెట్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్జూ: డ్రగ్స్ మాఫియా కేసులో విచారణ పారదర్శకంగా సాగుతోందని, సినీ పరిశ్రమను టార్గెట్ చేయడంలేదని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఆర్‌వి చంద్రవదన్ స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగ పరీక్షల కోసం బలవంతంగా రక్తనమూనాలు, వెంట్రుకలు సేకరించడం లేదన్నారు. నోటీసులు అందుకుని విచాణకు వచ్చినవారి అంగీకారంతోనే రక్త నమూనాలు సేకరించడం జరుగుతుందని చంద్రవదన్ పునరుద్ఘాటించారు. సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు 27మందిని విచారించినట్టు తెలిపారు. విచారించిన వారిలో 10 మంది ఇతరులూ ఉన్నారన్నారు. కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేసి విచారణ జరుపుతున్నామనడం సరికాదన్నారు. సినీ రంగానికి చెందిన 12 మందికి నోటీసులు ఇచ్చామని, అందులో ఐదుగురిని ప్రశ్నించినట్టు తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 19మందిని అరెస్టు చేయగా, వీరిలో ఆరుగురు వ్యక్తులు కెల్విన్, నిఖిల్‌శెట్టి, అనీష్, దిండు, విలియమ్, నోవా, పియూష్ అకులత్, జీషాన్ అలీ ముఖ్యులని చంద్రవదన్ తెలిపారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నామని, విచారణ పూరె్తైన తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది నిర్ణయిస్తామన్నారు. విచారణలో సిట్‌కు నిబద్ధత లేదనడం సరికాదన్నారు. చట్టం ప్రకారం ఎక్సైజ్ అధికారులకు నార్కొటిక్ అండ్ డ్రగ్స్ సబ్సిన్సన్ యాక్ట్ సెక్షన్ 41, 42, 53 కింద అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూ, ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చట్టానికి లోబడే దర్యాప్తు కొనసాగుతుందన్నారు.
విద్యార్థుల పేర్లు చెప్పలేదు: అకున్
డ్రగ్స్ కేసు విచారణలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తున్నామని, నిబంధనలకు లోబడి దర్యాప్తు కొనసాగుతుందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ కేసును దర్యాప్తు జరిపేందుకు తమకు అన్ని అధికారాలు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 7 కేసులు నమోదు చేశామని, విచారణ వీడియో చిత్రీకరణ ద్వారా సాగుతోందన్నారు. విచారణ వీడియో ఫుటేజీలను కోర్టుకు అందిస్తామని, విచారణ సమయంలో వైద్యుడిని అందుబాటులో ఉంచామని చెప్పారు. రాతపూర్వక అంగీకారంతోనే రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు తీసుకుంటున్నామని అకున్ స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగించే విద్యార్థుల పేర్లు వెల్లడించడం లేదని, కేసు పూర్వపరాలు తెలియకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. విద్యార్థులను పిలిపించి కౌనె్సలింగ్ నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్ కొనడం, అమ్మడం, దాచుకోవడం, ఇతరులకు సరఫరా చేయడం నేరమన్నారు. సుప్రీం కోర్టు గైడ్‌లెన్స్‌ను తాము అతిక్రమమించడం లేదని, చట్టానికి లోబడే దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు. సోమవారం నవదీప్‌ను విచారించే సమయంలో ఒక మహిళా అధికారి కూడా ఉన్నారని, ఈ కేసులో ఇద్దరు హీరోయిన్లకు కూడా నోటీసులు జారీ చేశామన్నారు. అయితే వారు కోరుకున్నచోట విచారిస్తామని వెల్లడించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారనడం పరువు నష్టం కిందకి వస్తుందని, బెదిరింపు కాల్స్‌కు భయపడేది లేదని అకున్ సబర్వాల్ హెచ్చరించారు.
డిజిపిని కలసిన అకున్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అనురాగ్ శర్మను సోమవారం రాత్రి కలుసుకున్నారు. డ్రగ్స్ కేసు దర్యాప్తు నేపథ్యంలో తనకు వచ్చిన బెదిరింపు కాల్స్, డ్రగ్స్ కేసులో కొనసాగుతోన్న విచారణకు సంబంధించి వివరాలు అందించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, సిట్ సేకరించిన ఆధారాలు వంటి వాటి నివేదికను డిజిపి అనురాగ్ శర్మకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసులో కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారని, అయితే తమకు అధికారికంగా పత్రాలు రాలేదని తెలిపారు. చట్టపరిధిలోనే దర్యాప్తుకు వచ్చిన వారి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుందని, బలవంతంగా తీసుకోవడం జరగదని సబర్వాల్ స్పష్టం చేశారు.

చిత్రం.. డ్రగ్స్ కేసు విచారణను మీడియాకు వెల్లడిస్తున్న సిట్ ఆఫీసర్ అకున్ సబర్వాల్