రాష్ట్రీయం

యాసంగి నుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరొక బహుమతిచ్చింది. 2017-18 యాసంగి పంటకు ఫిబ్రవరి నుంచి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు సేద్యానికి రోజూ 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సేద్యానికి రోజూ ఏడు గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. కాగా, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ 9 గంటలకు పెంచారు. సేద్యానికి 24 గంటలపాటు (రోజంతా) ఉచితంగా విద్యుత్ ఇస్తామని సిఎం కెసిఆర్ ఇటీవలే హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీమేరకు 9గంటల విద్యుత్ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర జెన్‌కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 2017-18 యాసంగి నుంచి సేద్యానికి 24 గంటలపాటు ఉచితంగా విద్యుత్ ఇస్తామన్నారు. ఇప్పటికే మెదక్, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో ‘పైలట్ ప్రాజెక్టు’ తరహాలో 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఈ జిల్లాల్లో పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నామని, మంచి చెడులను పరిశీలించి ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామన్నారు. 31 జిల్లాల్లో ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 13.5 వేల మెగావాట్ల నుంచి 14 వేల మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని ఆంచనా వేశామన్నారు. రాష్టవ్య్రాప్తంగా ప్రస్తుతం 22 లక్షల బావులు, బోర్‌బావులు ఉన్నాయని వివరించారు. 9 గంటల నుండి 24 గంటలకు ఉచిత విద్యుత్ సరఫరా పెంచడం వల్ల ట్రాన్స్‌కో ఏటా 16 వేల కోట్ల ఖర్చు భరించాల్సి వస్తుందన్నారు. ఉచిత విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వమే ట్రాన్స్‌కోకు డబ్బు చెల్లిస్తుందని వివరించారు.
ఆటోస్టార్టర్లు వద్దు
రైతులు ట్రాన్స్‌కోకు సహకరించాలని ప్రభాకర్‌రావు కోరారు. బావులకు ఆటో స్టార్టర్లు పెట్టవద్దని సూచించారు. దానివల్ల అవసరం లేకపోయినా మోటార్లు నడుస్తాయని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యుత్‌ను పంటలకు అవసరమైన మేరకు వాడుకోవాలని, వృథా చేయవద్దని సలహా ఇచ్చారు. ఉదయం 7-8 గంటల మధ్యలోనే రైతులు ఎక్కువగా విద్యుత్ వినియోగిస్తున్నారని చెప్పారు. విద్యుత్తు వినియోగం ఏ ఏటికాఏడు పెరుగుతూనే ఉందని ప్రభాకర్‌రావు తెలిపారు. 2016 జూలైలో పీక్ సమయంలో 6890 మెగావాట్ల విద్యుత్ వినియోగించగా, ఈరోజు 8,300 మెగావాట్ల విద్యుత్ వినియోగం అవుతోందన్నారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం విద్యుత్ వినియోగం అధికమైందన్నారు. 2016-17లో పీక్ సమయంలో 9191 మెగావాట్లు వాడామన్నారు. అంటే సరాసరిన 148 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించామని వివరించారు. రెండు రోజుల క్రితం ఇది 185 మిలియన్ యూనిట్లకు పెరిగిందని తెలిపారు. పీక్ డిమాండ్ 11 వేల మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకాకముందు ఈ ప్రాంత అవసరాలకు 6574 మెగావాట్లు వాడేవారని, మూడేళ్లలో మరో 5348 మెగావాట్లను చేర్చామన్నారు. ప్రస్తుతం జల, థర్మల్, సంప్రదాయేతర విధానాల్లో విద్యుదుత్పత్తి సంస్థల సామర్థ్యం 13,095 మెగావాట్లుగా ఉందని ప్రభాకర్‌రావు వివరించారు. మూడు నాలుగేళ్లలో మరో 13 వేల మెగావాట్లు కలుస్తుందని స్పష్టం చేశారు. అంటే మొత్తం ఉత్పత్తి 26 వేల మెగావాట్లకు చేరుతుంది. 2017 డిసెంబర్ నాటాకి 800 మెగావాట్లు లభిస్తుందన్నారు. భద్రాద్రి థర్మల్ స్టేషన్‌లో 270 మెగావాట్ల శక్తి కలిగిన నాలుగు యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయన్నారు. 2018 డిసెంబర్ వరకు ఈ కేంద్రం నుండి ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. అలాగే యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో 800 మెగావాట్ల శక్తికలిగిన 5 యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నామని, ఇందుకు సంబంధించి కసరత్తు జరుగుతోందన్నారు. మూడేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందన్నారు.
1.32 కోట్ల వినియోగదారులు
రాష్ట్రంలో 1.32 కోట్ల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని ప్రభాకర్‌రావు వివరించారు. ఇళ్లకు కోతల్లేకుండా విద్యుత్ అందిస్తున్నామని, స్థానికంగా ఎక్కడైనా విద్యుత్ పోతే చిన్నచిన్న మరమ్మతులు, ట్రీకటింగ్ తదితర కారణాలు ఉంటాయని వివరించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా జరుగుతోందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఒకటీ అరా గ్రామాలకు సాంకేతిక కారణాల వల్ల సరఫరా లేకపోతే లేకపోవచ్చని స్పష్టం చేశారు.

చిత్రం.. సేద్యానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రకటిస్తున్న జెన్‌కో, ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర రావు