రాష్ట్రీయం

ప్రత్యేక హోదా ఇస్తేనే మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: ఆంధ్రాకు ప్రత్యేక హోదా సాధిస్తేనే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, భాగస్వామ్య సదస్సుల్లో కుదిరే అవగాహనా ఒప్పందాల వల్ల వ్యక్తిగతంగా పేరు తప్ప రాష్ట్రానికి ప్రయోజనం చేకూరదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లెక్కలేనన్ని అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. కాని పరిశ్రమలకు కేంద్రం రాయితీలు ఇస్తేనే పెట్టుబడులు వస్తాయన్నారు.
ప్రత్యేక హోదాను గాలికి వదిలేసి, కేంద్రానికి చంద్రబాబు దాసోహం కావడం దారుణమన్నారు. చంద్రబాబు సదస్సులో ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి అంకెలు చెప్పారని, అవనీ అభూతకల్పనన్నారు. మూడు రోజుల సిఐఐ సదస్సులో 361 ఎంఓయూలు కుదిరాయని, ఇదంతా పాజిటివ్ కోణంలో స్వాగతిస్తామన్నారు. కాని పారిశ్రామికవేత్తలకు ఇక్కడ కల్పించే రాయితీలపై కేంద్రం వౌనంగా ఉండడం శోచనీయమన్నారు. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా తన ఉపన్యాసంలో ఏమీ మాట్లాడక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా గురించి కొంత కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. పరిశ్రమల అభివృద్ధికి వైకాపా కట్టుబడి ఉందని, కాని చంద్రబాబు అనుసరిస్తున్న ప్రచారం వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ లేదన్నారు. గతంలో కూడా హైదరాబాద్‌లో చంద్రబాబు భారీ ఎత్తున సిఐఐ సదస్సులు నిర్వహించారని, కాని ఎంఓయూలు అన్నీ కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. విద్యుత్ రంగంలో 1.14 లక్షల కోట్ల మేర అవగాహన ఒప్పందాలు కుదిరాయని, 20 కంపెనీలు సంతకాలు చేశాయని, కాని ఈ కంపెనీలన్నీ అధికారంలో ఉన్న పెద్దలవేనన్నారు. చైనాకు ఇటీవల చంద్రబాబు వెళ్లినప్పుడు 9వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కోసం సంతకాలు చేశారని, ఈ ప్రాజెక్టు ఏమైందన్నారు. తమ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిరంతరం ఉద్యమిస్తుందన్నారు.

ఎన్‌పిఆర్ గడువు పొడిగింపు

హైదారాబాద్, జనవరి 13: నేషనల్ పాపులేషన్ రిజిస్టర్‌లో పేర్లు నమోదు చేయించుకునే గడువును ఆంధ్రప్రదేశ్‌లో 2016 జనవరి 30 వరకు పొడిగించారు. వాస్తవంగా ఈ గడువు 2015 డిసెంబర్ 31తో ముగిసింది. కేంద్ర జనాభాలెక్కల శాఖ కోరిక మేరకు గడువును పెంచుతున్నట్టు సాధారణ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లింగరాజు పాణిగ్రహి పేరుతో బుధవారం జీఓ జారీ అయింది. ఎన్‌పిఆర్‌తో ఆధార్‌ను కూడా అనుసంధానం చేస్తారు.