రాష్ట్రీయం

ఆల్మట్టి వద్ద కృష్ణమ్మ పరవళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల: ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయానికి గత వారం రోజులుగా వస్తున్న వరద నీటి ఉద్ధృతి రోజు రోజుకు పెరుగుతోంది. సోమవారం ఎగువ ప్రాంతం నుండి ఆల్మట్టి జలాశయానికి 1,42,325 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరద నీటిని సద్వినియోగం చేసుకుంటూ అక్కడి అధికారులు పూర్తిస్థాయి నీటి మట్టాన్ని పెంచుకుంటున్నారు. అదే విధంగా అక్కడి విద్యుత్ ఉత్పత్తి కోసం 33 వేల క్యూసెక్కులను వినియోగించుకుంటున్నారు. దీంతో ప్రతి రోజు 8 నుండి 9 టిఎంసిల నీరు జలాశయంలోకి చేరుకుంటుండడంతో త్వరలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోనుంది. 129.72 టిఎంసిల సామర్థ్యం గల ఆల్మట్టి జలాశయంలో ప్రస్తుతం 89.02 టిఎంసిల నీరు నిల్వ ఉంది. అదే విధంగా నారాయణపూర్ జలాశయానికి ఎగువ ప్రాంతం నుండి 35,740 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక్కడి ప్రాజెక్టులో కూడా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతోంది. నారాయణపూర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 37.646 టిఎంసిలు కాగా, సోమవారం నాటికి 30 టిఎంసిల నీరు నిల్వ ఉంది. జూరాల జలాశయంలో 9.657 టిఎంసిల సామర్థ్యానికి గాను 6.731 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వస్తున్న వరద నీటి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని మరో వారం రోజుల్లో జూరాలకు కృష్ణమ్మ చేరనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టులో ఉన్న ఇన్‌ఫ్లోలను దృష్టిలో ఉంచుకొని జూరాల ప్రాజెక్టుపై ఆధారపడిన నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా ఫేజ్-1, ఫేజ్-2తో పాటు జూరాల జలవిద్యుత్కేంద్రం అధికారులు వరద జలాలను వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.