రాష్ట్రీయం

ఛార్మిపై ఒత్తిడి తేవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: డ్రగ్ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న సినీ నటి ఛార్మిపై మానసికంగా , శారీరకంగా ఎలాంటి ఒత్తిడికి గురిచేయవద్దని, ఆమె నుండి రక్త నమూనాలు, గోళ్లు, తలవెంట్రుకలు సేకరించవద్దని ఉమ్మడి హైకోర్టు అబ్కారీ శాఖను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నాడు హైకోర్టును ఛార్మి తరఫున న్యాయవాది ఎం విష్ణువర్ధనరెడ్డి పిటీషన్ దాఖలు చేశారు.డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా 26వ తేదీన తమ ఎదుట హాజరుకావాలని తెలంగాణ అబ్కారీ శాఖ సిట్ అధికారులు ఛార్మి కి నోటీసులు జారీ చేశారని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మహిళ కావడంతో ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడే విచారణ జరుపుతామని అధికారులు స్పష్టం చేయగా, తాను సిట్ కార్యాలయానికే వస్తానని ఛార్మి చెప్పారని, అయితే ఇటీవల కొంత మంది సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారుల వార్తలు పత్రికల్లో చదివి తన క్లయింట్ ఈ పిటీషన్ దాఖలు చేశారని ఆయన చెప్పారు.
సిట్ విచారణ తీరు బాగాలేదని, వారి విచారణపై తనకు అనుమానాలున్నాయని, విచారణకు వచ్చిన వారి నుండి రక్తం, వెంట్రుకలు, గోళ్లు బలవంతంగా సేకరిస్తున్నారని ఛార్మి అన్నారు. అలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని ఛార్మి తన పిటీషన్‌లో పేర్కొన్నారు. నాంపల్లి స్టేషన్‌లో హాజరుకావాలని జూలై 2న తనకు నోటీసులు వచ్చాయని, తన తల్లిదండ్రులు హైదరాబాద్‌లో లేరు కనుక తనతో పాటు విచారణకు న్యాయవాదిని అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆమె ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు. తనపై బెదిరింపులు, దౌర్జన్యం జరగకుండా చూడాలని, తనను విచారించాలంటే మహిళా అధికారులే ఉండాలని ఆమె కోరారు. ఇప్పటి వరకూ హాజరైన వారి నుండి శాంపిల్స్ తీసుకున్నారని తెలుస్తోంది, ఎవరో ఎదో ఆరోపణ చేశారని నా నుండి శాంపిల్స్ ఎలా తీసుకుంటారు? నా వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించారు. 1978లో సత్‌పతి వర్సెస్ దని కేసును ఆమె ఉదహరించారు. సంబంధం లేని ప్రశ్నలు వేసి మానసికంగా దెబ్బతీయడానికి వీలు లేదని అన్నారు. తెలుగు, మలయాళం, కన్నడంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో తాను నటించానని, గత 15 ఏళ్ల నుండి సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకున్నానని, గౌరవనీయ కుటుంబం నుండి వచ్చానని, తన తండ్రి వ్యాపారి అని, వారికి కూడా మించి పేరు ఉందని చెప్పారు. షూటింగ్‌కు వెళ్లిన ప్రతిసారి తన వెంట కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉంటారని ఆమె కోర్టుకు వివరించారు.