రాష్ట్రీయం

రక్షణ భూమి కేటాయింపకు ఓ కే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదులోని కరీంనగర్ రహదారిపై ఉన్న రక్షణ శాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆంగీకరించిందని చంద్రశేఖరరావు వెళ్లడించారు. రాష్ట్ర సచివాలయం నిర్మాణానికి మార్గం సుగమం అయినట్లేనా అని ఒక విలేకరి అడుగగా కేవలం సచివాలయ నిర్మాణం తమకు ముఖ్యం కాదని ముఖ్యమంత్రి చెప్పారు. సచివాలయ నిర్మాణం కంటే హైదరాబాదుకు సంబందించిన రోడ్ల విస్తరణ, హై వేల నిర్మాణం, మల్టి లేయర్ రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణం తమకు అత్యంత ముఖ్యమని చంద్రశేఖరరావు తెలిపారు. కరీంనగర్ రహదారిపై పలు ఫ్లైఓవర్లు నిర్మించవలసి ఉన్నదన్నారు. ఈ లక్ష్య సాధన కోసం రక్షణ శాఖ భూమిని కేటాయించేందుకు నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని ఆయన చెప్పారు. రక్షణ శాఖ భూమి కేటాయింపుకు సంబంధించిన ప్రక్రియను తానే స్వయంగా పూర్తి చేయిస్తానని మోదీ హామీ ఇచ్చారని చంద్రశేఖర రావు వెళ్లడించారు. మల్టిలేయర్ రోడ్డుల, ఫ్లైఓవర్ల నిర్మాణం వలన హైదరాబాదులో వాహనాల రాకపోకలు సులభతరం అవుతాయని ఆయన చెప్పారు. కరీంనగర్ రోడ్డు, మేడ్చెల్ రోడ్డును అభివృద్ది చేయవలసి ఉన్నదన్నారు.