రాష్ట్రీయం

నిరుద్యోగులపై సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 27: నిరుద్యోగ భృతి కల్పించాలని నిర్ణయించిన సిఎం చంద్రబాబు, రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ, యువకుల సమాచారాన్ని సేకరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కిమిడి కళా వెంకట్రావు, పితాని సిత్యనారాయణ, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, నారా లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, వివిధ శాఖల అధికారులతో నిరుద్యోగ భృతి అంశంపై సిఎం గురువారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. నిరుద్యోగ భృతికి సంబంధించి విధి విధానాల రూపకల్పన ఎలా ఉండాలనే దానిపై సమీక్షలో సిఎం లోతుగా చర్చించారు. ముఖ్యంగా ఏ వయసు నుంచి ఏ వయసు వరకు భృతి ఇవ్వాలి, ఎనే్నళ్లు ఇవ్వాలి, భృతి పొందేందుకు విద్యార్హత ఏది నిర్ణయించాలి, మిగిలిన ప్రాతిపదికలు ఏముండాలి అనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో యువతకు సంబంధించి సమస్త సమాచారాన్ని సేకరించిన తర్వాతే విధి విధానాలపై తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిరుద్యోగ భృతి కార్యక్రమం ఇంత పెద్దఎత్తున చేపట్టడం దేశంలోనే ఇది తొలిసారని, దీన్ని సమర్థవంతంగా అమలుచేసి అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా పటిష్ట విధానం రూపొందించాలని సూచించారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్‌లలో, సాధికార సర్వే, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, వివిధ వర్శిటీల్లో సమాచారాన్ని సేకరించి అనుసంధానించాలని చెప్పారు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ ఆర్థిక సాయంతో నైపుణ్య శిక్షణ పొందినవారి వివరాలు, విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించినవారి జాబితాను రూపొందించాలన్నారు. యువత అభివృద్ధికి ఉత్తమ చర్యలు చేపట్టిన పలు దేశాల విధానాలను మరింత అధ్యయనం చేయాలని సిఎం సూచించారు.
జవాబుదారీతనం ఉండాలి: మంత్రులు
నిరుద్యోగ భృతి కోసం వందల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించాల్సి ఉన్నందున జవాబుదారీతనం తప్పనిసరిగా ఉండాలని సమీక్షలో పాల్గొన్న మంత్రులు అభిప్రాయపడ్డారు. భృతి ద్వారా లబ్ధి పొందే యువత సమాజానికి తిరిగి సేవ చేసేలా విధాన రూపకల్పన జరగాలని తెలిపారు. కేవలం భృతితో సరిపెట్టకుండా నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేలా ఆర్థిక సాయం అందించడం, ఆస్తుల సృష్టి జరిగేలా చూడటం, కంపెనీల్లో ఖాళీలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వడం వంటి వాటిపైనా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. 15 రోజుల అనంతరం మరోసారి సమీక్ష నిర్వహిద్దామని చెప్పారు.

చిత్రం.. నిరుద్యోగ భృతి అంశంపై మంత్రులు, అధికారులతో సమీక్షిస్తున్న సిఎం చంద్రబాబు