రాష్ట్రీయం

పూరి, కెల్విన్‌తో ములాఖత్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: మాదకద్రవ్యాల కేసు లో అనుమానితులను విచారించే కొద్దీ అదనపు సమాచా రం దొరుకుతుంది సిట్ బృందానికి. గురువారం ఉదయం నటి ముమైత్ ఖాన్‌ను ఎక్సైజ్ సిట్ బృందం విచారించింది. సుమారు ఆరున్నర గంటలపాటు సాగిన విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డ్రగ్స్ వినియోగం, సరఫరాపై అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, డ్రగ్స్ మాఫియా కీలక సూత్రధారి కెల్విన్‌తో ములాఖత్ ఉన్నట్టుగా సిట్ అధికారులకు క్లారిటీ వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. మధ్యాహ్నం వరకు సాగిన విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు లేద ని, సరఫరాదారులెవరో తెలియదని, డైరెక్టర్ పూరితో తనకు ఎలాంటి పరిచయాలు లేవని ముమైత్ తెగేసి చెప్పారు. మధ్యాహ్నం మూడు గంటల తరువాత సిట్ అధికారులు ఇప్పటి వరకు విచారణ జరిపిన నటీనటుల వీడియోలు చూపెడుతూ పలు ప్రశ్నలు సంధించడంతో ఆమె కీలక సమాచారాన్ని చెప్పక తప్పలేదని చెబుతున్నారు. ప్రధానంగా డ్రగ్స్ డాన్ కెల్విన్‌తో ఆమెకున్న పరిచయాలపైనే సిట్ ఆరా తీసినట్టు సమాచారం. కెల్విన్ సెల్‌ఫోన్‌లో ముమైత్ ఫోన్ నెంబర్ ఉండడంతో పాటు వీరిద్దరి మధ్య చాటింగ్ వివరాలకు సంబంధించిన అంశాలను సైతం అధికారులు సేకరించినట్టు సమాచారం. డ్రగ్స్‌తో సినీ పరిశ్రమకు ఉన్న సంబంధాలు, కెల్విన్ ఎవరెవరికి తెలుసు.. ఎవరెవరికి సరఫరా చేశాడు, డ్రగ్స్‌ను ఎవరు సమకూరుస్తారు? వంటి ప్రశ్నలకు ఆమె కీలక సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ముమైత్‌ఖాన్ టాలీవుడ్‌కు పరిచయం అవకముందు ఏం చేసేవారు.. ఆపై హైదరాబాద్ నుంచి ముంబయికి ఎందుకు వెళ్లారన్న విషయాలను సైతం విచారణలో భాగంగా అడిగి తెలుసుకున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా గోవా, బ్యాంకాక్‌లకు ఎందుకు వెళతారన్న సిట్ ప్రశ్నలపై ముమైత్ క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పబ్‌లకు వెళ్లే అలవాట్లపై కూడా సిట్ ప్రశ్నించినట్టు తెలిసింది. కాగా ముమైత్‌తోపాటు మరో ఇద్దరినీ విచారించామని సిట్ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే ముమైత్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడంపై మూడు గంటలు హైడ్రామా సాగింది. మధ్యాహ్నానికి ముందు తనకు డ్రగ్స్ అలవాటు లేదని, కావాలంటే బ్లడ్ శాంపిల్స్ తీసుకోండని ఆమె సిట్ అధికారులకు తెలుపగా, అవసరమైతే తీసుకుంటామని సిట్ బృందం చెప్పింది. పలు ప్రశ్నలపై క్లారిటీ వచ్చిన అనంతరం సిట్ అధికారులు ముమైత్ తల వెంట్రుకలు, గోళ్లు, రక్తం నమూనాలను తీసుకున్నారు.
నేడు సిట్ ముందుకు రవితేజ: అకున్ సబర్వాల్
సినీ ప్రముఖుల విచారణలో భాగంగా శుక్రవారం హీరో రవితేజ సిట్ అధికారుల విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే రెండుసార్లు అతని విచారణ తేదీ వాయిదాపడిన విషయం తెలిసిందే. గురువారం నటి ముమైత్‌ఖాన్ విచారణ అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సినీ హీరో రవితేజ శుక్రవారం విచారణకు హాజరవుతారన్నారు. ముమైత్‌ఖాన్‌తోపాటు నజీర్, ముబీన్‌ను విచారించామని అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. ముమైత్‌ను అధికారులు హరికిషన్, రేణుక, విజయలక్ష్మి, కరుణ విచారించారని, ముమైత్ ఇచ్చిన సమాచారంతో పలుచోట్ల సోదాలు జరిపామని అకున్ వెల్లడించారు. నటి చార్మి విచారణకు వచ్చిన సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారని వచ్చిన కథనాలు అవాస్తవమని, నటి చార్మి ఎక్సైజ్ పోలీసులపై ఎలాంటి ఫిర్యాదూ చేయలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు.

చిత్రం.. సిట్ విచారణకు హాజరవుతున్న నటి ముమైత్‌ఖాన్