రాష్ట్రీయం

ఆగస్టు 23న నంద్యాల ఉపఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 27 : కర్నూలు జిల్లాలోని నంద్యాల శాసనసభా స్థానానికి ఉపఎన్నిక షెడ్యూల్‌ను గురువారం ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ నెల 29వ తేదీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అదే క్షణం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 5 వరకూ నామినేషన్లు స్వీకరించి, 7న పరిశీలిస్తారు. అదే రోజు అర్హత కలిగిన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. ఇక నామినేషన్లను ఉప సంహరించుకునే వారికి ఆగస్టు 9 సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఉంటుంది. వెంటనే పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 23 ఉదయం 7 నుంచి సాయం త్రం 5గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. 28న ఓట్లు లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 11గంటల సమయానికి ఫలితం వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నంద్యాల ఉపఎన్నిక అనివార్యం కావడంతో ప్రధాన రాజకీయ పార్టీలైన టిడిపి, వైకాపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే ప్రచారంలో తలమునకలయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో టిడిపికి చెందిన మంత్రులు అధికార లాంఛనాలు లేకుండా పార్టీ నాయకుల మాదిరి ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది.