రాష్ట్రీయం

పర్వతాన్ని జయంచిన గురుకుల విద్యార్థిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, జూలై 27: యాదాద్రి జిల్లా ఆలేరు మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బొల్లెద్దుల శ్రీవిద్య ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన పర్వతాల్లో ఒకటైన రష్యాలోని ఎల్బరస్ పర్వతాన్ని గురువారం అధిరోహించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.30కు శిఖరం పైకి చేరుకుంది. శ్రీవిద్య నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన సైదులు, స్వరూప దంపతుల మూడవ కుమార్తె. శ్రీవిద్య ఐదవ తరగతిలో ఆలేరులోని
గురుకుల పాఠశాలలో ప్రవేశం పొంది సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పర్వతాల అధిరోహణ శిక్షణలో ఎంపికై రష్యా పర్వతాధిరోహణకు ఎంపికైంది. తమ పాఠశాల విద్యార్థిని రష్యా పర్వతాన్ని అధిరోహించడం పట్ల పాఠశాల కో ఆర్డినేటర్ లక్ష్మినారాయణ, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీశైలం, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు శ్రీవిద్యకు అభినందనలు తెలిపారు.

చిత్రం.. రష్యాలోని ఎల్బరస్ పర్వతంపై భారత పతాకాన్ని ఎగురవేస్తున్న శ్రీవిద్య